Raja Gopal files petition in YS Jagan DA case ‘సుప్రీం’కు రాజగోపాల్..తన పేరును తొలగించాలని పిటీషన్

Raja gopal files petition in ys jagan dissappropriate assets case

Retired IAS officer, Andhra Pradesh Mines department former director, VD Raja Gopal, Supreme Court, AP CM YS Jagan, YS Jagan dissappropriate assets case, AP High Court, Andhra Pradesh, Politics

Retired IAS officer and former director of United Andhra Pradesh Mines department VD Raja Gopal files petition in Supreme Court asking for deletion on his name from present Andhra Pradesh Chief Minister YS Jagan dissappropriate assets case. The same was rejected by the AP High Court.

జగన్ అక్రమాస్థుల కేసు: తనను తప్పించాలని ‘సుప్రీం’లో రాజగోపాల్ పిటీషన్

Posted: 01/07/2020 12:36 PM IST
Raja gopal files petition in ys jagan dissappropriate assets case

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయల అక్రమాస్థులు కూడగట్టారన్న ఆరోపణలపై రంగంలోకి దిగిన సీబిఐ అధికారులు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేసి ఆయనపై పలు చార్జీషీట్లు రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులలో వైఎస్ జగన్ తో పాటు ఆయన సంస్థలకు అడిటర్ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి సహా పలువురు మంత్రులు, అప్పటి ప్రభుత్వంలో క్రీయాశీలక పదవుల్లో వున్న అధికారుల మెడకు కూడా చుట్టుకున్న విషయం తెలిసిందే.

జగన్ పై దాఖలైన పలు కేసుల్లో ఒక్కటైన ఓబాళాపురం మైనింగ్ కేసులో అప్పటి గనుల శాఖ సంచాలకుడిగా వున్న ఐఏఎస్ అధికారి విడి రాజగోపాల్.. ప్రస్తుతం తన విధుల నుంచి రిటైర్మెంట్ పోందారు. కాగా, కేసు నేపథ్యంలో తాను పదవీ విరమణ పొందిన తరువాత ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రాకపోవడంతో.. ఆయన తన పేరును వైఎస్ జగన్ అక్రమాస్థుల జాబితా నుంచి తప్పించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

కాగా, ఇదే విషయమై ఆయన గతంతో రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు నాలుగు వారాల గడువు కోరారు. దీంతో వారు అడిగిన గడువును జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఇచ్చారు. ఓఎంసీ అక్రమాల సమయంలో ఏపీ గనుల శాఖ డైరెక్టర్‌గా రాజగోపాల్ పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబాళాపురం మైనింగ్ కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles