Amaravati Protest: TDP Leaders House Arrested కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల హౌజ్ అరెస్ట్

Tdp leaders under house arrest ahead of high power committee meeting

YS Jagan, Amaravati, Amaravati farmers, joint action committee, mahadharna, TDP leaders, House Arrest, amaravati protesters, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Ahead of High Power Committee meeting and the Cabinet meeting on Wednesday, JAC gave a call to lay siege to Amaravati as part of the agitation. While the police deployed the personnel in huge numbers at the houses of the TDP leaders throughout the state to keep them under house arrest.

కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల హౌజ్ అరెస్ట్

Posted: 01/07/2020 11:53 AM IST
Tdp leaders under house arrest ahead of high power committee meeting

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధాను ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. అమరావతి ప్రాంత రైతులు.. జేఏసీ తలపెట్టిన మహాధర్నాకు టీడీపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని తమ ఇళ్లలోనే గృహనిర్భంధంలో వుంచారు. రైతుల జేఏసీతో కలసి టీడీపీ ఎలాంటి అందోళనలకు చర్యలను చేపట్టనీయకుండా ముందస్తు చర్యలను తీసుకున్న పోలీసులు ఎక్కడిక్కడ కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని టీడీపీ నేతలు హౌజ్ అరెస్టులు చేశారు.  

చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్భంధనానికి రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అలాంటి చర్యలను చేపట్టకుండా పోలీసులు టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్, వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబులను తెల్లవారుజామునే పోలీసులు తమ ఇళ్లలో అరెస్ట్ లో వుంచారు. చింతకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్‌ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గ్రామస్థులు, రైతులు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకున్నారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను హౌస్‌ అరెస్టు చేశారు. విజయవాడ, పెనమలూరు, నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలను గృహనిర్బంధంలో ఉంచారు.  

మంగళగిరిలో టీడీపీ నేత గంజి చిరంజీవి, తాడేపల్లి రూరల్‌ అధ్యక్షుడు కొమ్మారెడ్డి నాని, పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావును హౌజ్ అరెస్టు చేశారు. తాడేపల్లి పట్టణ, రూరల్‌ తెలుగుదేశం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పట్టణంలో జేఏసీ నాయకులు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్యను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్‌ స్టేషన్ కు తరలించారు. సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావును గృహనిర్బంధంలో ఉంచారు. ఇదే సమయంలో సీపీఎం కార్యాలయంలో సమావేశమైన 20 మంది రైతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గల్లా ఇంటి వద్ద ఉద్రిక్తత: చీకటి రోజన్న జయదేవ్

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నివాసం వద్ద అతన్ని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. అమరావతి రైతులకు మద్దతుగా ఆయన చినకాకాని వద్ద రహదారి దిగ్బంధానికి బయలుదేరిన గల్లాను పోలీసులు నిలువరించారు. ఆయనను నివాసం వద్దే అడ్డుకున్న పోలీసులు నోటీసులు అందించారు. ఆయినా ముందుకెళ్తున్న ఆయనను ఇంటి బయటకు రానీయకుండా పోలీసులు గేటుకు తాళ్లు కట్టి అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచరులు, కార్యకర్తలతో కలసి తన నివాసం వద్దే జయదేవ్ నిరసన తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ తాను ఏం నేరం చేశానని పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. నేనేమైనా హింసకు పాల్పడ్డానా? చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుగా పెట్టుకుని చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. వచ్చే నాలుగేళ్లు ఎలా వుంటుందోనని అలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు కూడా అవకాశమివ్వని ఈ రోజును చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles