EX MP Rayapati booked in Fema case మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఫెమా కేసు

Ed books fema case on former mp rayapati sambasiva rao

Rayapati Sambasiva Rao, case on Rayapati, Fema case on Rayapati, enforcement directorate, Fema case, Defaulter, Banks, Transstroy, CBI, TDP, Ram Madhav, Defaulter, Banks, Hyderabad, Guntur, Chandrababu Naidu, Amaravati, YS Jagan, Jagan Mohan reddy, Andhra Pradesh, Politics

Enforcement Directorate has booked Fema case on Former MP Rayapati Sambasiva Rao, who is the chairman and director of Transstroy company, on the allegations that the company had diverted the bank loans to foreign companies.

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఫెమా కేసు

Posted: 01/03/2020 11:15 AM IST
Ed books fema case on former mp rayapati sambasiva rao

మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదయ్యింది. నిధుల మళ్లింపు విషయంలో రాయపాటిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌టాయ్‌ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.16 కోట్లు సింగపూర్‌, మలేషియాకు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే రాయిపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే.

15 బ్యాంకుల నుంచి రూ.8832 కోట్లు కంపెనీ రుణం తీసుకున్నది. రూ.3822 కోట్లు దారి మళ్లించినట్టు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. సింగపూర్‌, మలేషియా, రష్యాలకు నిధులు మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు తన ఇంటికి సోదాల కోసం వచ్చినప్పుడు తాను ఇంట్లో లేనని స్పష్టం చేసిన ఆయన, తనిఖీల తరువాత వారికి ఏమీ లభించలేదని అన్నారు. అదే విషయాన్ని చెబుతూ, వారు తన ఇంటి నుంచి వెళ్లిపోయారని మీడియాకు చెప్పారు.

అంతేకాదు అసలు సీబీఐ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని రాయపాటి అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వ్యవహారాలన్నీ సంస్థ సీఈవోనే చూసుకుంటున్నారని, తనకుగానీ, తన కుటుంబీకులకు గానీ ప్రమేయం లేదని అన్నారు. కాగా, సీబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫెమా చట్టం కింద కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles