IndiGo to compensate passengers who found cockroach విమానంలో బొద్దింక.. స్పందించని సంస్థకు వాయింపు..

Indigo asked to compensate passengers who found cockroach on pune delhi flight

IndiGo airlines, IndiGo Pune Delhi flight, pune district consumer disputes redressal forum, kothrud, cockroach in IndiGo flight, IndiGo to compensate passengers, Umesh Jawalikar, Kshitija Kulkarni, Sangeeta Deshmukh, president, Pune District Consumer forum, Skand Asim Bajpai, Surabhi Rajiv Bharadwaj

IndiGo asked to recompense two travellers who found roach on flight. Pune District Consumer Disputes Redressal Forum directed IndiGo airline to refund the ticket amount, along with additional Rs 50,000 compensation, to two passengers who faced hardship while travelling to Delhi from Pune.

విమానంలో బొద్దింక.. స్పందించని సంస్థకు వాయింపు..

Posted: 01/03/2020 11:56 AM IST
Indigo asked to compensate passengers who found cockroach on pune delhi flight

సంపన్నవర్గాలతో పాటు అధికాదాయ మధ్యతరగతి వర్గాలు అధికంగా వినియోగించుకునే విమానయానం మన దేశంలో క్రమంలో విస్తృతంగా మారింది. విమానయాన రంగం విస్తృతం కావడంతో మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందన్న చందాన.. విమానయాన సంస్థలు తమ కస్లమర్లకు అందించే సేవల నాణ్యత లోపబూయిష్టంగా మారుతొంది. ఇలాంటి లోపబూయిష్టమైన పని కారణంగా ఓ విమానయాన సంస్థను వినియోగదారుల ఫోరమ్ వాయించింది. విమానం సీట్లో బొద్దింక ప్రత్యక్షం అయిందని చెప్పినా.. పట్టించుకోని పాపనికి పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తరూడ్ పట్టణానికి చెందిన స్కంద్ ఆసిమ్ బాజ్ పాయ్, సురభీ రాజీవ్ భరద్వాజ్ లు.. 2018 డిసెంబరు 31వ తేదీన పూణే నుంచి ఢిల్లీకి ప్రయాణించేందుకు ఇండిగో విమానం ఎక్కారు. విమానం ఎక్కిన వారికి సీటు కింద బొద్దింకను కనుగొన్నారు. దీనిపై ఇండిగో విమానయాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే విమానం సీటును శుభ్రం చేయాల్సిన సిబ్బంది అందుకు భిన్నంగా ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వార విమాన సంస్థకు ఫిర్యాదు చేయాలని సిబ్బంది ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానం విని ఖంగుతిన్నారు.

విమానం దిగాక ఇద్దరు ప్రయాణికులు తమకు ఎదురైన అనుభవాన్ని ఢిల్లీలోని ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయంలో పిర్యాదు చేశారు. అంతేకాదు తమ సెల్ ఫోన్లలో తీసిన బొద్దింకల ఛాయాచిత్రాలు చూపిస్తూ ఫిర్యాదు సమర్పించారు. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన విమానయాన సంస్థ సమస్యను పరిష్కరించక పోగా.. విమానంలో బొద్దింకలు ప్రత్యక్షకావడం తీవ్రమైన నేరం కాదని ప్రయాణికులను సమాధానం ఇచ్చింది. దీంతో సదరు విమానయాన సంస్థపై ఇద్దరు ప్రయాణికులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

బొద్దింకను తన చేతితో తొలగించేటపుడు గాయాలయ్యాయని బాజ్ పాయ్, ఇంతటి నిర్లక్షపు నాణ్యత కరువైన సేవలను అందించిందడంతో పాటు పిర్యాదులపై కూడా పట్టనట్టు వ్యవహరించి నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులిద్దరూ ఇండిగో నుంచి నష్టపరిహారం, వ్యాజ్యం ఖర్చును ఇవ్వాలని వినియోగదారుల ఫోరంకు సమర్పించిన ఫిర్యాదులో కోరారు. విమానం సీట్లో బొద్దింక ప్రత్యక్షం కేసును విచారించిన పూణే వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు ఉమేష్ జవాలికర్ సంచలన తీర్పు చెప్పారు. విమానం టికెట్ చార్జీని 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని, వారికి అదనంగా రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఇండిగో ఎయిర్‌లైన్స్ ను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IndiGo airlines  cockroach  consumer Forum  skand Asim Bajpai  pune-delhi flight  compensate  

Other Articles