Film producer's son pushes cops, booked ఆర్జీవీ తెచ్చిన తంటా.. నట్టికుమార్ కొడుకుపై కేసు

Tollywood producer natti kumar s son kranthi abuses cop booked

Natti Kumar son arrested, Kranthi arrested, Kranthi abuses cops, Hyderabad Police, Son, Producer’s son pushes cops, Hyderabad news, hyderabad crime news, film producer Natti Kumar, Natti Kumar booked, assault on Natti Kumar, Natti Kumar, son arrested, Kranthi arrested, Hyderabad Police, Panjagutta, Tollywood, Telangana, Crime, Entertainment, Movies

Punjagutta police booked Tollywood producer Natti Kumar’s son Kranthi for allegedly abusing police officers in an inebriated state during New Year celebrations near Country Club in Begumpet.

ఆర్జీవీ తెచ్చిన తంటా.. నట్టికుమార్ కొడుకుపై కేసు

Posted: 01/02/2020 01:37 PM IST
Tollywood producer natti kumar s son kranthi abuses cop booked

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తెలుగు చిత్రరంగంలో అనేక వివాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన రేంజ్ నుంచి ఆయన గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతున్న సమయంలో ఆయన రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని చిత్రాలను రూపొందించారు. తన సినిమాలకు మీడియాతో ప్రచారం ఎలా కల్పించుకోవాలో ఆర్జీవికి తెలుసునని కూడా పలువురు వ్యాఖ్యానించారంటే ఆయన రేంజ్ ఇట్టే అర్థమైపోతుంది. ఆయనకే కాదు ఆయన పేరుకు కూడా ఆ రేంజ్ వుందని కంట్రీ క్లబ్ న్యూఇయర్ రోజున నిరూపించింది.

తమ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆర్జీవిని తీసుకువస్తామని చెప్పడంతో.. ఆర్జీవిని చూడాలని.. ఆశతో కొందరు యువత కంట్రీ క్లబ్ ఈవెంట్ కు హాజరయ్యారు. కానీ వాస్తవానికి అక్కడికి ఆర్జీవి రాలేదు. అసలు న్యూఇయర్ అంటే తనకు మా పెద్దగా ప్రత్యేకతేమీ లేదని, ఇది ప్రతీరోజు మాదిరిగానే వుంటుందని ఆర్జీవి చెప్పిన మాటలను ఒంటపట్టించుకోని యువత ఆయన కోసం వేచిచూశారు. వారిలో ఒకరు టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తనయుడు కాంత్రి కుమార్. ఇచ్చిన మాటను తప్పారంటూ ఈవెంట్ నిర్వాహకులతో క్రాంతి కుమార్ ఘర్షణకు దిగారు. దీంతో ఆయన కారును అడ్డుకున్న నిర్వాహకులు, తాళాలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.

దీంతో తన కారు కనిపించడం లేదంటూ కంట్రీక్లబ్ వద్ద విధుల్లో ఉన్న ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డికి క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇందుకు అంగీకరించని క్రాంతికుమార్ ఎస్సైతో వాదులాటకు దిగడంతో ఆయనను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన నట్టి కుమార్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తం 13 మందితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

తన కుమారుడ్ని పోలీసులు అదుపులోకి ఎందుకు తీసుకున్నారంటూ వాదులాటకు దిగారు.  అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న సిబ్బందిని నట్టి కుమార్ కుటుంబ సభ్యులు చేత్తో నెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు..విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై హైదరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అంతేగా మరి ఎవరి అనువుగాని చోట అధికులం అన్నరాదన్నది ఇప్పటికైనా కాంత్రికుమార్ కు బోధపడిందోలేదో మరి. ఇక ఆర్జీవి పేరుకున్న కాంట్రావర్సీ పవర్ ఇదని కూడా పలు రూమర్లు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Natti Kumar  son arrested  Kranthi arrested  country club  RGV  Hyderabad Police  Panjagutta  Tollywood  Telangana  Crime  

Other Articles