Delhi fire: Several trapped after building collapse ఢిల్లీ అగ్నిప్రమాదం.. పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం

Major lapses in safety norms behind peeragarhi factory fire says delhi fire services chief

Delhi fire, Delhi peeragarhi fire, Delhi fire news updates, delhi fire updates, several trapped after Delhi factory fire,Delhi fire,Delhi building collapse,battery factory,Peeragarhi fire,West Delhi fire,Delhi Fire Services

A fire broke out at a factory in Delhi's Peeragarhi in the early hours of Thursday. During rescue operations a blast occurred, causing the collapse of the factory building in which several people, including fire brigade personnel, are still trapped.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం

Posted: 01/02/2020 01:04 PM IST
Major lapses in safety norms behind peeragarhi factory fire says delhi fire services chief

దేశ రాజధాని న్యూఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని ఓ పరిశ్రమలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలను అర్పుతున్న సమయంలోనే ఓ పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో అగ్నిమాపక సహాయక బృందాలు పలువురు పరిశ్రమ శిధిలాల్లో చిక్కుకున్నారని సమాచారం. వీరిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహాయక బృందాలు, పోలీసులు రంగంలోకి దిగారు.

ఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని పీరాగర్లీలోని ఓ ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ అగ్ని ప్రమాదం  విషయం తెలిసిన వెంటనే  ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలోనే భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడ శిథిలాల కింద చిక్కుకున్నారు.  శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు.

ఈ ఫ్యాక్టరీలో బ్యాటరీలు లీకైన కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మంటలను 36 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ భవనం కుప్పకూలింది. కాగా, ఈ పరిశ్రమ భవనం నిర్మాణం సహా అనేక అక్రమాలకు పాల్పడిందని అగ్నిప్రమాదం నేపథ్యంలో వెల్లడైన తొలి దర్యాప్తులో వెల్లడైందని అగ్నిమాపక సేవల డైరెక్టర్ అటుల్ గర్జ్ తెలిపారు. పరిశ్రమ నిర్మాణంలో అనేక నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్టు తెలుస్తోందని అన్నారు.

పరిశ్రమలో వున్న అత్యంత సున్నితమైన వస్తువులకు గాను తగిన సంఖ్యలో ఫైర్ ఎస్టిన్ గ్విషర్స్ ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇక పరిశ్రమ నిర్మాణంలోనే నిబంధనలకు నీళ్లు వదిలారని, తగిన సంఖ్యలో బయటకు వెళ్లేందుకు మార్గాలు లేవని, చెప్పుకోచ్చారు. ఈ పరిశ్రమ నిర్మాణంలో తగిన వెంటిలేషన్ కూడా లేదని, అందుచేతే ప్రమాదం తీవ్రత పెరిగిందని భవనం కుప్పకూలడానికి కూడా కారణమయ్యిందని అన్నారు. ఇక పరిశ్రమ నిర్మాణానికి సంబంధిత శాఖ అధికారుల నుంచి ఎన్ఓసీలు కూడా తీసుకున్నారా.? లేదా అన్న అంశాలను కూడా పరిశీలిస్తామని ఆయన అన్నారు.

ఈ అగ్నిప్రమాదంలో మొత్తంగా 14 మంది గాయపడ్డారని అందులో 13 మంది అగ్నిమాపక దళానికి చెందిన వారేనని అటుల్ గార్డ్ తెలిపారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన జరిగిన ఓ ఘోర అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి చెందారు. ఆ తర్వాత కూడ మరో ప్రాంతంలో కూడ అగ్నిప్రమాదం  చోటు చేసుకొంది. ఈ రెండు ఘటనల తర్వాత  చోటుచేసుకొన్న అగ్నిప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles