Tihar prepares four new gallows to hang Nirbhaya convicts నిర్భయ కేసు: దోషుల కోసం సిద్దమవుతున్న ఉరికంబాలు

Nirbhaya rape murder case tihar jail readies new gallows to hang all 4 convicts together

mercy petition, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

Tihar jail seems to be preparing for the hanging of four convicts in the Nirbhaya rape case. As per sources, the jail authorities are readying new gallows frame and making other preparations for the hanging of convicts.

నిర్భయ కేసు: దోషుల కోసం సిద్దమవుతున్న ఉరికంబాలు

Posted: 01/02/2020 02:52 PM IST
Nirbhaya rape murder case tihar jail readies new gallows to hang all 4 convicts together

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచార కేసులోని దోషులు తమ చావును తప్పించుకునేందుకు వినియోగించిన చివరాఖరి అస్త్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడంతో.. ఇక వారికి ఉరిశిక్ష విధించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ కేసులోని ముగ్గురు దోషులు తమకు విధించబడిన ఉరిశిక్ష నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ క్షమాబిక్ష పిటీషన్ వేశారు. దేశ సర్వో్న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన పత్రాలను ధాఖలు చేసిన నేపథ్యంలో న్యాయస్థానం నుంచి దోషుల పిటీషన్లు రాష్ట్రపతి భవన్ కు చేరాయి.

అయితే ఈ క్షమాబిక్ష పిటీషన్లను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారని కార్యాలయ వర్గాల నుంచి సమాచారం. ఇక అత్యాచార కేసుల్లో దోషులుగా తేలిని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాబిక్ష ఇవ్వడం కుదరదని.. ఈ కేసుల్లోని దోషులకు న్యాయస్థానాలు విధించే శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన తెలంగాణలో ప్రియాంకా రెడ్డి హత్యాచార ఉదంతం నేపథ్యంలో ఓ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తీహార్ జైలు అధికారులు ఈ కేసులో దోషులైన నలుగురికి ఒకేసారి ఉరిశిక్షను విధించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 7న వీరిపై డెత్ వారెంట్ తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తుండగా, నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఒకే ఉరికంబం ఉండడంతో, మరో మూడింటిని నిర్మిస్తున్నారు. పీడబ్ల్యూడీ విభాగం సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమైంది. నూతనంగా మూడు ఉరికంబాలను, మూడు సొరంగాల నిర్మాణాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. కాగా, తీహార్ జైల్లో ఉరి తీసే ప్రదేశంలో మొత్తం 16 డెత్ సెల్స్ ఉండగా, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించగానే, నలుగురినీ నాలుగు వేర్వేరు గదులకు జైలు అధికారులు తరలించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya  Murder  Rape  convicts  Tihar jail  gallows  hanging  mercy petition  New Delhi  crime  

Other Articles