EX MP Rayapati sensational comments amid cbi searches సీబిఐ దాడుల తరువాత రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Former mp rayapati sambasiva rao sensational comments amid cbi searches

Rayapati Sambasiva Rao, Rayapati sensational comments, Rayapati to change political party, CBI, TDP, Ram Madhav, Defaulter, Banks, Hyderabad, Guntur, Chandrababu Naidu, Amaravati, YS Jagan, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Andhra Pradesh, Politics

Amid CBI searches on the residences and Offices of former MP Rayapati Sambasiva Rao on 31st december, today at tirumala he had given the signs of changing the political party in future.

సీబిఐ దాడుల తరువాత రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted: 01/02/2020 12:04 PM IST
Former mp rayapati sambasiva rao sensational comments amid cbi searches

మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి, స్వామిని దర్శించుకున్న ఆయన, ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి షాక్ ఇవ్వక తప్పదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. వరుసగా నేతల వలసలతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ నుంచి తాను కూడా వలస వెళ్లే అవకాశాలు లేకపోలేదని సంకేతాలను ఇచ్చారు. అయితే ఇప్పటికిప్పుడే ఇలాంటి చర్చ అప్రస్తుతమని రాయపాటి అన్నారు.

సీనియర్ రాజకీయ నేతగా తలపండిన మేధావియైన ఆయన.. తనదైన శైలిలోనే పార్టీ మారే విషయమై సంకేతాలిచ్చారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచనేదీ లేదని అంటూనే.. అలాగని భవిష్యత్తులో తాను టీడీపీలోనే కొనసాగే విషయమై పునరాలోచించాల్సి వుంటుందని అన్నారు. ఇక ఏ పార్టీలో చేరేది.. ఎప్పుడు చేరేది అంతా కార్యకర్తల అభీష్టం మేరకు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా భవిష్యత్తుకు సంబంధించిన విషయమని ఇప్పుడే చెప్పలేమన్నారు.

రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు తన ఇంటికి సోదాల కోసం వచ్చినప్పుడు తాను ఇంట్లో లేనని స్పష్టం చేసిన ఆయన, తనిఖీల తరువాత వారికి ఏమీ లభించలేదని అన్నారు. అదే విషయాన్ని చెబుతూ, వారు తన ఇంటి నుంచి వెళ్లిపోయారని అన్నారు. అసలు సీబీఐ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని రాయపాటి అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వ్యవహారాలన్నీ సంస్థ సీఈవోనే చూసుకుంటున్నారని, తనకుగానీ, తన కుటుంబీకులకు గానీ ప్రమేయం లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rayapati Sambasiva Rao  CBI  TDP  Ram Madhav  Defaulter  Banks  political party  tirumala  Tirupati  Andhra Pradesh  Politics  

Other Articles