Harish Rao in JaggaReddy constituency జగ్గారెడ్డి ఇలాకాలో టీచర్ గా మంత్రి హరీశ్ రావు..

Minister harish rao turns school teacher in sangareddy video goes viral

Harish Rao, TRS, Finance MInister, School Teacher, Kandi ZPHS School, Students, Sangareddy District, Jagga Reddy constituency, Teachers, Principal, Viral Videos, video viral, Telangana, Politics

Telangana Finance Minister Harish Rao turned into a teacher during a sudden inspection at a school in Sangareddy. Now, the video went viral on social media and netizens are busy in praising the minister.

ITEMVIDEOS: జగ్గారెడ్డి ఇలాకాలో టీచర్ గా మంత్రి హరీశ్ రావు..

Posted: 12/28/2019 03:59 PM IST
Minister harish rao turns school teacher in sangareddy video goes viral

పదో తరగతి పరీక్షల తేదీ విడుదలైన నాటి నుంచి తాను ఎక్కడకు వెళ్లినా.. మార్గమధ్యంలో వున్న ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొంత సేపు అగి అక్కడి విద్యార్థులను పలకరించి వారితో మాట్లాడి.. వారి అక్షరజ్ఞానానికి పరీక్ష కూడా పెడుతున్నారు. పనిలో పనిగా అక్కడి ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయుడిని కూడా కాసింత ఘాటుగానే పలకరిస్తున్నారు. ఇదంతా చెప్పి చేస్తున్న తతంగమైతే కాదు కానీ.. చెప్పకుండానే ఆకస్మికంగా ఈ పనులకు శ్రీకారం చుడుతున్నారు మంత్రి హరీశ్ రావు.

రాష్ట్ర అమాత్యుడిగా ఇలాంటి పనులు చేయడంలో తప్పేంలేదు.. పరీక్షల నేపథ్యంలో ఇలాంటి అకస్మిక తనిఖీలు కొంతైనా విద్యార్థులకు మేలు చేస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆయన ఈ తనిఖీలను సంగారెడ్డిలో చేపట్టడమే చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నాయకుడు జగ్గారెడ్డికి చెందిన సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తనిఖీలు చేయడం ఆసక్తికరంగా మారింది. కందిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన మంత్రి.. కాసేపు ఉపాధ్యాయుడి అవతారమెత్తారు.

పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు తెలుగులో సరిగా పేర్లు రాయలేకపోవడం, ఎక్కాలు కూడా చెప్పలేకపోవడంతో ఉపాధ్యాయుల బోధన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పదో ఎక్కం రాకపోతే విద్యార్థులు పది ఎలా పాసవుతారు?ఈ పోటీ ప్రపంచంతో ఎలా పోటీ పడతారని అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలలో ఏం నేర్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం కంది శివారులో నూతనంగా నిర్మిస్తున్న తెరాస జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. భవనాన్ని మరింత నాణ్యంగా నిర్మించాలని గుత్తేదారులకు సూచించారు.

ఇటీవల మంత్రి హరీశ్‌ రావు తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌లోని గురుకుల పాఠశాలలో నిర్మించిన ధ్యాన మందిరం, అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. పలువురు పదో తరగతి విద్యార్థులను మంత్రి పిలిచి ప్రిన్సిపల్‌ దత్తాత్రేయశర్మ పేరును తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రాసి చూపాలని.. అదేవిధంగా 7, 13, 17వ ఎక్కాలను చెప్పాలని అడిగారు. వారు రాయలేకపోయారు.. చెప్పలేకపోయారు. దీంతో మంత్రి ఉపాధ్యాయులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles