Solar Eclipse 2019: Impact On Zodiac Signs కంకణాకార సూర్యగ్రహణం.. ఎవరి లాభం.. ఎవరికి నష్టం.?

Decade and year last solar eclipse 2019 impact on zodiac signs

solar eclipse 2019, details on solar eclipse, solar eclipse impact, impact of solar eclipse on zodiac signs, schools closed on solar eclipse, holiday on solar eclipse, pathani samanta planetorium, astrology, decade last solar eclipse, solar eclipse, astrology, zodiac sign, impact of solar eclipse, 26th december 2019, Hindu Temples, Ritual

According to astrologers, the solar eclipse will bring good luck for Leo, Scorpio, Aquarius, Libra, Cancer, Virgo while it will have some mixed and negative impact on people with Aries, Taurus, Capricorn, Sagittarius and Gemini zodiac signs.

కంకణాకార సూర్యగ్రహణం.. ఎవరి లాభం.. ఎవరికి నష్టం.?

Posted: 12/24/2019 07:37 PM IST
Decade and year last solar eclipse 2019 impact on zodiac signs

డిసెంబర్ 26, గురువారం నాడు సూర్యగ్రహణం సంభవించనుంది. యావత్ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కనిపించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు దీనిని వీక్షించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ గ్రహనం కంకణాకారంగా సంభవిస్తుండటంతో, ఎలా ప్రారంభమవుతుంది..? ఎలా మధ్యమానికి చేరుకుంటుంది.? ఎలా ముగుస్తుందన్న ఉత్కంఠ, ఉత్సహాం యువత, విద్యార్థుల్లో అధికంగా వుంది. అసలే క్రిస్మస్ సెలవులు రావడం.. సెలువుల్లోనే సూర్యగ్రహనం సంభవించడం.. తమ పిల్లలకు ఇది కొత్త అనుభూతిని మిగులుస్తుందని తల్లిదండ్రులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇక సూర్యగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో రాహుకేతు పూజలు జరిపే శ్రీకాళహస్తి సహా ఇలాంటి శైవక్షేత్రాలు మినహా మిగతా అన్ని దేవాలయాలూ మూతబడనున్నాయి. దేవాలయాలన్నీ సాయంత్రం ఆలయంలో సంప్రోక్షణ పూజలు జరిపిన తరువాత తెరవనున్నారు. అయితే పలు ఆలయాలు మాత్రం మరుసటి రోజు వేకువ జాము వరకు మూసివేస్తామని ఆయా ఆలయాల కమిటీలు తెలిపాయి. ఈ గ్రహణంపై పంచాంగకర్తలు వివరణ ఇస్తూ, ఏ రాశివారికి మేలు కలుగుతుంది, ఏ రాశి వారికి ఎటువంటి ప్రభావం ఉంటుందన్న అంశంపై వివరణ ఇస్తున్నారు.

ఈ గ్రహణం, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ వికారి నామ సంవత్సరం మార్గశిర బహుళ అమావాస్య నాడు, మూలా నక్షత్రంలో ధనస్సు రాశియందు తీపాధాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా సంభవించనుంది. గ్రహణ సమయం విషయానికి వస్తే, ఉదయం 8.07కు ప్రారంభమవుతుందని, 9.31 గంటలకు మధ్యకాలమని, 11.20కి ముగుస్తుందని, మొత్తం 3.09 గంటల పాటు గ్రహణం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ గ్రహణం వృషభం, కన్య, తుల, కుంభ రాశులవారికి శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు. అలాగే మిగతా రాశులవారిపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

మేషరాశి వారికి చింత
మిధున రాశి వారికి స్త్రీ కష్టం
కర్కాటక రాశి వారికి అతి కష్టం
సింహ రాశి వారికి అశాంతి
వృశ్చిక రాశి వారికి ధన వ్యయం
ధనస్సు రాశి వారికి ప్రాణహాని
మకర రాశి వారికి ఆరోగ్య హాని
మీన రాశి వారికి మనోవ్యధ
ప్రభావం ఉంటుందని పంచాంగకర్తలు హెచ్చరిస్తున్నారు. అయితే తమపై దుష్పలితాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు గ్రహణ సమయంలో ఇష్టదేవతారాధన చేయడం కొంతవరకు ఫలితాల ఇస్తుందని వారు సూచిస్తున్నారు. ఇక ఖగోళ శాస్త్రవేత్తలు, ఈ గ్రహణం కంకణాకారంలో ఏర్పడుతుంది కాబట్టి, చూసేందుకు అద్భుతంగా ఉంటుందని, అయితే, కళ్లకు హాని కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని చూడాలని సూచిస్తున్నారు. గ్రహణాన్ని వీక్షించేందుకు ఇండియాలోని పలు సైన్స్ మ్యూజియాలు, ప్లానిటోరియాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles