governor prevented from entering JU convocation జేయూ స్నాతకోత్సవం వద్ద గవర్నర్ కు ఛేదు అనుభవం..

West bengal governor greeted with black flags at jadavpur university

CAA protest, NRC, bengal governor, Jagdeep Dhankhar, Jadavpur University, Kolkata, TMC, Mamata Banerjee, West Bengal, Citizenship Amendment Act, national register of citizens, bengaluru protests, Chennai protests, Jamia protests, Anti-CAA protests, Section 144, West Bengal, politics, Crime

After being shown black flags by students at the Jadavpur University on Tuesday morning with placards that read "BJP activist Mr Jagdeep Dhankar, go back", West Bengal Governor Jagdeep Dhankhar termed the whole incident 'unwholesome and worrisome situation'.

జేయూ స్నాతకోత్సవం వద్ద గవర్నర్ కు ఛేదు అనుభవం..

Posted: 12/24/2019 06:39 PM IST
West bengal governor greeted with black flags at jadavpur university

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌కు వరుసగా రెండో రోజు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్‌ను అక్కడి విద్యార్థులు అడ్డుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వీరంతా గవర్నర్‌ కారును చుట్టుముట్టి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. సీఏఏకు అనకూలంగా మాట్లాడుతున్న గవర్నర్‌ చేతుల మీదుగా తాము డిగ్రీలు తీసుకునేది లేదని పట్టుబట్టారు. దీంతో చేసేదేం లేక గవర్నర్‌ అక్కడి నుంచి వెనుదిరిగారు.

దీనిపై గవర్నర్‌ ధన్‌కర్‌ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి వైస్‌ ఛాన్సలర్‌ వీటిని నియంత్రించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ తీరును కూడా ఎండగట్టారు. విద్యార్థుల మధ్య చిక్కుకున్న తర్వాత వీసీ గానీ.. యూనివర్శిటీ సిబ్బంది గానీ తనను సంప్రదించలేదని, అయితే మీడియాకు మాత్రం బైట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను బంధిస్తోందని ఆరోపించారు.

గవర్నర్‌ ధన్‌కర్‌కు సోమవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. స్నాతకోత్సవరం గురించి యూనివర్శిటీ అధికారులతో మాట్లాడేందుకు వచ్చిన గవర్నర్‌ను విద్యార్థులు అడ్డుకుని నల్లజెండాలు ప్రదర్శించారు. దాదాపు అరగంట తర్వాత గవర్నర్‌ యూనివర్శిటీ భవనంలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా విద్యార్థులు మరోసారి అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌ అయిన గవర్నర్‌ ధనకర్‌ను స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఆందోళనల దృష్ట్యా ఆయనకు ఈ కార్యక్రమంలో ప్రసంగించే, డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles