constable fires on youth, who called dial 100 ‘నిద్ర చెడగొడతావా..’ యువకుడిపై కానిస్టేబుల్ ఫైర్

Constable fires on youth who called dial 100 in late night

Koteshwar Rao, HAL colony, Media person, jeedimetla police station, Sajjanar, police commissioner, Cyberabad, Telangana, Crime

A Cyberabad Constable fires on a young boy who had called up dial 100, to get rid of locals mess shouting each other and creating nusisance in midnight in limits of jeedimetla police station. police rush to spot clears nuisance and fires on youth who called dial 100, takes him up to policestation.

డయల్ 100: ‘నిద్ర చెడగొడతావా..’ యువకుడిపై కానిస్టేబుల్ ఫైర్

Posted: 12/23/2019 03:18 PM IST
Constable fires on youth who called dial 100 in late night

అత్యవసర సమయంలో కానీ.. ఆపద ముంచుకొస్తుందని భావించిన సమయంలో కానీ లేదా మరేవిధమైన క్లిష్టపరిస్థితుల్లో వున్నా.. వెంటనే ‘డయల్ 100’ అంటూ పోలీసులకు ఫోన్ చేయాలని తెలంగాణలో విసృత్వంగా ప్రచారం చేస్తున్నారు పోలీసులు. పాఠశాలలు, యువతుల కాలేజీలు, గ్రామాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు ఇలా డయల్ 100 అనే సర్వీసు మీ గురించే వుందని చెబుతున్నారు. ఇది నిజమేనా.? అంటే నిజమే.. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలో కొందరు పోలీసులు మాత్రం తాము రక్షణ భటులం అని మర్చిపోతున్నారు.

అంతేకాదు తామున్మది ప్రజలకు రక్షణ కోసమని, శాంతిభద్రతలు పరడవిల్లేలా చేయాల్సిన బాధ్యత కూడా తమపై వుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ క్రమంలో వీరు ప్రదర్శించే తీరు.. అచరించే వ్యవహారాలు.. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి పనిచేసే ఎందరో పోలీసులను కూడా అవమానించేలా వున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో జరగిన దిశ దుర్ఘటన తర్వాత తమకు ఏప్పుడు ఏ క్షణంలో ఫోన్ వచ్చినా.. వెంటనే అప్రమత్తమవుతున్న పోలీసులు ఎందరెందరికో అపన్నహస్తం అందించారు. అయితే కొందరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

అల్లరి మూకల నుంచి రక్షించమని ఓ యువకుడు ‘డయల్ 100’కు ఫోన్ చేస్తే... రెండు చెంపలు వాయించి స్టేషన్ కు తీసుకెళ్లి.. సదరు యువకుడిపై బూతు పురాణం అందుకున్న ఓ పోలీసు.. నిలకడగా అతను మీడియాలో పనిచేసే వ్యక్తి అని తెలిసి.. గంట తరువాత ఇంటి వద్ద దింపిన ఘటన సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్లలో జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జీడిమెట్ల‌లోని హెచ్‌ఎఎల్ కాల‌నీలో జరిగింది. అల్ల‌రిమూక‌ గొడ‌వ చేస్తుండటంతో.. ‘డయల్ 100’కి ఫోన్ చేశాడు ఓ యువకుడు.

సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని అల్ల‌రిమూక‌ను చెద‌ర‌గొట్టారు. అర్థరాత్రి పూట పంచాయితీ ఏంటని అల్లరిమూకను స్టేషన్ కు తరలించేందుకు బదులు.. మరో ఘనకార్యం చేసి చిక్కారు. డయల్ 100 అర్థరాత్రి పూట ఫోన్ చేసిన యువకుడికి ఫోన్ చేసి రమ్మని పిలిచి.. అతడిపై తిట్ల దండకం అందుకున్నాడు. అర్ధ‌రాత్రిపూట నిద్ర ఎందుకు చెడ‌గొట్టావురా? ఎవ‌రు కొట్టుకుని చ‌స్తే నీకెందుకురా? అంటూ నానా బూతులు మాట్లాడాడు. అక్కడితో ఆగక.. రెండు చెంప‌లు వాయించారు. అయినా తన కోపం చల్లారకపోవడంతో జీపులో జీడిమెట్ల పీఎస్ కు తీసుకెళ్లాడు.

కుటుంబ స‌భ్యుల‌తో ఫోన్‌లో మాట్లాడనీయకుండా యువకుడి నుంచి కోటేశ్వరరావు ఫోన్ లాక్కున్నాడు. ఈలోగా ఇంట్లో నిద్రిస్తున్న తమ కుమారుడు ఎక్కడి వెళ్లాడంటూ అంతా వెతికిన వారి తల్లిదండ్రులు.. కాలనీలో కూడా గాలించారు. ఈ లోగా పోలిస్ స్టేషన్ కు యువకుడిని తీసుకుని వెళ్లిన కానిస్టేబుల్ కోటేశ్వర రావు.. అతను ఏం చేస్తాడో తెలుసుకుని అందోళన చెందాడు. ఆ యువకుడు ఓ మీడియాలో పని చేస్తున్నాడని తెలిసి సారీ చెప్పి.. గంట తరువాత తిరిగి ఇంటవద్దకు తీసుకువచ్చి దింపాడు. ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌కు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ‘డయల్ 100’కి ఫోన్ చేస్తే.. ఇంటి నుంచి తీసుకెళ్లి మ‌రీ ఎలా కొడ‌తారని కుటుంబ స‌భ్యులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన సీపీ స‌జ్జ‌నార్.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles