God Women Seen In Video Holding Cobras During Dance మెడలో పాముతో స్వామిని నృత్యం.. పాలాభిషేకం..

God women kapila seen in video holding cobras during dance

God Woman, Walajabad, Snake, Dance, Kabila, Chengalpattu, Kancheepuram, viral video,Tamil Nadu, Crime

Authorities have arrested a godwoman in Tamil Nadu for using snakes during her 'poojas'. Kabila caught the attention of officials when videos with a cobra around her neck went viral.

ITEMVIDEOS: మెడలో పాముతో స్వామిని నృత్యం.. పాలాభిషేకం..

Posted: 12/23/2019 01:41 PM IST
God women kapila seen in video holding cobras during dance

దైవాంశసంభూతురాలిగా ప్రకటించుకున్న అమెలో అత్యాశ అవహించింది. తాను నిర్వహిస్తున్న ఆలయానికి మరింత పేరు రావాలని, అక్కడి పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని అమె గత ఏడాది చేసిన పని అమెను కటకటాల వెనక్కి పంపింది. అతి ఎప్పటికైనా అదోగతి పట్టిస్తుందన్న నానుడి మరోమారు నిజమైంది. తాను నిర్వహిస్తున్న ఆలయానికి భక్తులను పెద్ద సంఖ్యలో అకర్షించేందుకు అమె చేసిన ప్రయత్నమే అమెకు పేరును తీసుకువచ్చింది. దీంతో పాటు నీడలాగే వెంటాడిని దరదృష్టం కూడా ఏడాది దాటగానే.. అమెను ఊఛలు లెక్కపెట్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన వాలాజాబాద్‌ మండల పరిధిలోని అవెల్లేరి అమ్మ ఆలయంలో వనభద్రకాళీ అమ్మవారి దేవాలయాన్ని నిర్వహిస్తుంది కమిల అనే మహిళ. జాతకాలు చెబుతూ తన భక్తిని చూసుకుంటుంది. అయితే అమెకు ఉన్నట్టుండి ఏం అయ్యిందో తెలియదు కానీ.. తన నిర్వహణలోని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని అనుకుంది, ఇందుకోసం అమె ఓ గత ఏడాదిలో వనభద్రకాళి అమ్మవారి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించింది. ఆ సమయంలో ఓ పామును తెచ్చి, కాసేపు అమ్మవారి మెడలో ఉంచి, ఆపై తానూ అమ్మ స్వరూపాన్నేనని చెబుతూ, దాన్ని తన శరీరంపై వేసుకుని నృత్యం చేస్తూ అమ్మవారికి పాలాభిషేకం చేసింది.

(Video Source: TV9 Telugu Live)

ఈ ఘటన తరువాత ఆలయం పేరు, కపిల పేరు మారుమోగడంతో భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో పాముతో ఆమె నాట్యం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవి చెంగల్పట్టు  జిల్లా అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వాలాజాబాద్ కు వచ్చి, విచారించారు. పామును ఎక్కడి నుంచి తెచ్చారని, ఎక్కడ పెట్టారన్న ప్రశ్నలకు కపిల నుంచి సమాధానాలు రాకపోవడంతో, వన్యప్రాణుల నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. ఆపై కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : God Woman  Walajabad  Snake  Dance  Kabila  Chengalpattu  Kancheepuram  viral video  Tamil Nadu  Crime  

Other Articles