Centre issues clarification on citizenship law మెట్టు దిగిన కేంద్రం: వేధింపులు ఉండవని స్పష్టం..

No indian citizen will be unduly harassed by asking to prove citizenship mha

CAA protest, NRC, Ministry of Home Affairs, MHA, harrassment, Citizenship Amendment Act, national register of citizens, bengaluru, bengaluru cop, national anthem, CAA protests, Chennai, Marina beach, protests, Jamia protests, Anti-CAA protests, Chetan Singh Rathore, DCP Bengaluru Police, Section 144, karnataka, Crime

Among the uncertainity and misinformation among certain sections over the amendment Citizenship Act and nationwide NRC, Ministry of Home Affairs has clarified that no Indian citizen will be unduly harassed or put to inconvenience by asking to prove citizenship.

మెట్టు దిగిన కేంద్రం: వేధింపులు ఉండవని స్పష్టం..

Posted: 12/21/2019 04:52 PM IST
No indian citizen will be unduly harassed by asking to prove citizenship mha

పౌరసత్వ సవరణ చట్టాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్‌ఆర్సీపై వస్తున్న వదంతులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. పౌరసత్వం గురించి దేశంలో ఏ ఒక్కరినీ వేధించే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ధ్రువపత్రాల సమర్పణలో పౌరులకు ఇబ్బందులు సృష్టించబోమని తెలిపింది. అంతేకాదు పౌరసత్వ నమోదులో ఎవరికీ ఎలాంటి వేధింపులు కూడా వుండవని స్పష్టం చేసింది.

‘‘నిరక్ష్యారాస్యులైన వారి వద్ద ఎలాంటి పత్రాలు ఉండకపోవచ్చు. అలాంటి వారు ఇతర సాక్ష్యాలు, స్థానికంగా ధ్రువీకరించిన ఆధారాలను ఇవ్వొచ్చు. దీనిపై ఒక నిర్దిష్టమైన ప్రక్రియను అవలంబిస్తాం. భారత పౌరులమని నిరూపించుకోవడానికి పుట్టిన తేదీ లేదా నివాస స్థలానికి సంబంధించిన ధ్రువపత్రాలు ఇవ్వొచ్చు. లేదా రెండూ సమర్పించొచ్చు. అలాగే సమర్పించాల్సిన పత్రాల జాబితాలో ఇంకా చాలా ఉంటాయి. వాటిలో ఏవైనా ఇవ్వొచ్చు. పత్రాల పేరిట పౌరుల్ని వేధించకుండా.. అసౌకర్యం కలిగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ప్రజలకు హోంశాఖ భరోసా కల్పించింది.

దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరసత్వం కల్పించే విషయంలో అనేక వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. తాజాగా వీటిని హోంశాఖ నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. అయినా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అందోళనలు మాత్రం ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. మరోవైపు సీఏఏపై సూచనలు స్వీకరించేందుకు సిద్ధమని ఓ ఉన్నతాధికారి శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles