VijaySai Reddy states the CM to bifurcates State with 25 districts రాష్ట్రంలో పునర్విభజన.. 25 జిల్లాలు: విజయ్ సాయ రెడ్డి

Vijaysai reddy appeals people to bring ys jagan to power again

vijay sai reddy, Member of Rajya sabha, visakhapatnam, district, assembly segments, bifurcation, ap re-organisation bill, YS Jagan, CM, andhra pradesh, Politics

Vijay sai Reddy, member of Rajya Sabha had appealed the people of andhra pradesh to see the progress of the state after YCP party came to power, and urged to bring YS Jagan Mohan Reddy as the CM for the state for the second time with 224 seats.

రాష్ట్రంలో పునర్విభజన.. 25 జిల్లాలు: విజయ్ సాయ రెడ్డి

Posted: 12/21/2019 06:50 PM IST
Vijaysai reddy appeals people to bring ys jagan to power again

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం వున్న 13 జిల్లాలతో పాటు మరో 12 ప్రాంతాలకు జిల్లాల హోదా కలుగుతుందని అన్నారు. ఈ క్రమంలో ఈ సారి రాష్ట్రంలో జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీకి 151 స్థానాలను అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 224 స్థానాల్లో గెలిపించాలని కోరారు.

దీంతో ఈ ఐదేళ్ల కాలంలో కేంద్రం రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా చేస్తోందని ఆశాభావాన్ని ఆయన మాట్లాడిన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలను పునర్విభజన బిల్లులో పొందుపర్చినట్టుగా 225 స్థానాలకు, అదే విధింగా తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలను 175 స్థానాలకు పెంచేందుకు రంగం సిద్దం అవుతుందన్న వార్తలను ఆయన వ్యాఖ్యల్లో పరోక్షంగా ఊటంకించారు. విశాఖలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో 3 రాజధానులు వస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని 5 నెలల్లో జగన్‌ చేసి చూపించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay sai reddy  district  assembly segments  bifurcation  YS Jagan  CM  andhra pradesh  Politics  

Other Articles