దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులోని హత్యాచార నిందితుల మృతదేహాలకు మరోమారు పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాలు జారీ చేసింది. నిందితులకు సంబంధించి ధాఖలైన పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం రాష్ట్ర పోలీసులకు సంబంధం లేకుండా ఢిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని అదేశించింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ నిందితులకు రీఫోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశించింది. ఈ పక్రియను సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు పూర్తి చేయాలని కూడా గడవు విధిస్తూ అదేశాలను జారీ చేసింది. ఆ తరువాత అదే రోజు సాయంత్రం నిందితులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని కూడా న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. నిందితుల కుటుంబసభ్యులు మృతదేహాలకు అంత్యక్రియలు చేసుకోవచ్చునని చెప్పారు.
అంతేకాకుండా, ఎన్ కౌంటర్ లో పోలీసులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని సిట్ కు హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు ఎన్ని తుపాకులను వాడారు. వాటిలో నిందితులు ఎత్తుకెళ్లిన తుపాకులను కూడా స్వాథీనం చేసుకోవాలని న్ని అని కూడా ప్రశ్నించారు. నిందితులపై కాల్పులు జరిపేందుకు పోలీసులు ఎన్ని తుపాకులు వినియోగించారు.. వాటిలో ఎన్ని బులెట్లు వారికి దిగాయన్న విషయాలను తుపాకులను కూడా స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం అదేశించింది. కాగా గాంధీ అసుపత్రి వైద్యులు న్యాయస్థానంలో హాజరై నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50శాతం మేర కుళ్లిపోయాయని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more