Mamata Banerjee demands referendum on CAA and NRC యుఎన్ ఆద్వర్యంలో సీఏఏపై రెఫరండం: కేంద్రానికి మమత సవాల్

Mamata banerjee wants un monitored referendum on caa and nrc

mamata banerjee, united nations, referendum, modi Government, Challenge, CAA protest, NRC, Citizenship Amendment Act, national register of citizens, bengaluru, bengaluru cop, national anthem, CAA protests, Jamia protests, Anti-CAA protests, NRC, West Bengal, Politics, Crime

Throwing a challenge to Centre's ruling BJP, West Bengal Chief Minister Mamata Banerjee called for a UN-controlled referendum across the country on CAA and NRC and said the Modi government would have to resign if the people rejected the two.

యుఎన్ ఆద్వర్యంలో సీఏఏపై రెఫరండం: కేంద్రానికి మమత సవాల్

Posted: 12/20/2019 03:15 PM IST
Mamata banerjee wants un monitored referendum on caa and nrc

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దమ్ముంటే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)లపై ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాలు విసిరారు. ఈ ఓటింగ్ లో కనుక బీజేపీ ఓటమిపాలైతే గద్దె దిగిపోవాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అయిన తర్వాత ఇప్పుడు భారతీయ పౌరులుగా నిరూపించుకోవాలా? అని ప్రశ్నించారు. సీఏఏను కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు నిరసనలు ఆపవద్దని పౌరులకు మమతా బెనర్జీ సూచించారు.

నిరసనల ముసుగులో బీజేపీ కార్యకర్తలే ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మమత అరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న మమత.. సీఏఏ, ఎన్ఆర్సీల విషయంలో తమ నిరసనలపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేవరకు తమ పోరాటం అగబోదని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఎన్ఆర్సీ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని మమత సూచించారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ఓటర్ల జాబితా పనులు మొదలయ్యాయని, జాబితాలోని నకిలీ పేర్లను తొలగిస్తామని మమత పేర్కొన్నారు. ప్రజలందరి పేర్లూ జాబితాలో ఉంటాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. కొన్ని  సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.  కర్ణాటక మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamata banerjee  united nations  referendum  modi Government  Challenge  CAA protest  NRC  West Bengal  Politics  Crime  

Other Articles