cop-sings-national-anthem to end caa protest డీసీపీ చేసిన పనితో శాంతించిన అందోళనకారులు..

Cop sings national anthem caa protesters sing along and end protest

CAA protest, NRC, Deputy Commissioner of Police, chetan singh rathore, Citizenship Amendment Act, national register of citizens, bengaluru, bengaluru cop, national anthem, CAA protests, Chennai, Marina beach, protests, Jamia protests, Anti-CAA protests, Chetan Singh Rathore, DCP Bengaluru Police, Section 144, karnataka, Crime

The protests against the Citizenship Amendment Act (CAA) have now spread to Karnataka. In an attempt to convince the protesters to end their protests, DCP of Bengaluru, Chetan Singh Rathore sang the national anthem, to make the protesters blocking the road to rise up.

ITEMVIDEOS: డీసీపీ చేసిన పనితో శాంతించిన సీఏఏ అందోళనకారులు..

Posted: 12/20/2019 03:13 PM IST
Cop sings national anthem caa protesters sing along and end protest

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టంపై పలు రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మక రూపం కూడా దాల్చాయి. క్రమంగా ఈ అందోళనలు దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకాయి. కర్ణాటకలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. బెంగళూరు, మంగళూరులో ఆందోళనకారులు పలుచోట్ల టైర్లు మండిస్తూ నిరసనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 144 సెక్షన్‌ విధించినప్పటికీ రోడ్లపైకి నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కాగా బెంగళూరు టౌన్ హాల్‌ వద్దకు చేరుకున్న నిరసనకారులను.. నిలువరించి అక్కడి నుంచి పంపించేందుకు ఓ పోలీసు ఉన్నాతాధికారి చేసిన వినూత్న ప్రయత్నం నెట్టింల్లో వైరల్ గా మారడంతో పాటు అనేక మంది ప్రశంసలను కూడా అందుకుంది. ఇక ఇక్కడి విచిత్రమేమంటే. నిరసనకారులు హృదయాలను కూడా ఆయన చేసిన పని తాకింది. అంతే అంతా అతనితో పాటు మూడునాలుగు నిమిషాల పాటు వుండి.. ఆ తరువాత అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు.

ఇంతకీ ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు.. ఎం చేశారంటే.. బెంగళూరు టౌన్ హాల్ వద్దకు చేరకున్న అందోళనకారులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. తమ చేతుల్లోని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అక్కడకు చేరుకున్న బెంగళూరు సెంట్రల్‌ డీసీపీ చేతన్‌ సింగ్‌ రాథోడ్‌ వారితో పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా మాట్లాడారు. శాంతియుత నిరసనలో అరాచక, అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే పరిస్థితి చేజారుతుందంటూ హెచ్చరించారు.

అయినప్పటికీ ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో.. వారిని నచ్చజెప్పిన ఆయన తాను ఒక గీతాన్ని అలపిస్తానని, దానిని విన్న తరువాత అందరూ మౌనంగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయితే ఆయన ఏం పాటను అలపిస్తారా.? అంటూ అందరూ వేచిచూస్తున్న తరుణంలో ఆయన ఏకంగా జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. దీంతో ఆయనతో పాటు గొంతు కలిపిన నిరసనకారులు.. జాతీయ గీతాన్ని అలపించారు. ఇక ఆలాపన పూర్తైన తరువాత ఒక్కొక్కరుగా ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో డీసీపీ చేతన్‌ సింగ్‌ రాథోడ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘దేశంలోని చాలా చోట్ల.. ముఖ్యంగా ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును మనం చూశాం. మరికొన్ని చోట్ల నిరసనకారులపై విరుచుకుపడ్డ పోలీసులను కూడా చూశాం. అయితే మీరు ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ఎవరికీ హాని కలగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మీకు సెల్యూట్‌ సార్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles