Telangana mulls hiking land value to fill coffers రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుకు సన్నాహాలు చేస్తున్న సర్కార్

Telangana government mulls hiking land value to fill coffers

Excise department, CM KCR, liquor rates hike, RTC Charges hike, Land Registration charges, Financial deficit, Butget, Telangana, politics

After hiking liquor prices a few days ago, the Telangana government is set to enhance land values (government value) by up to 20% for registration of properties soon.

రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుకు సన్నాహాలు చేస్తున్న సర్కార్

Posted: 12/19/2019 08:21 PM IST
Telangana government mulls hiking land value to fill coffers

తొలిపర్యాయం తెలంగాన పరిపాలనా పగ్గాలను అందుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండో పర్యాయం ఎన్నికలకు వెళ్లిన తరుణంలో కూడా అనేకానేక హామీలను గుప్పించారు. ప్రజాకూటమికి పోటీగా నిరుద్యోగ భృతి కల్పించడంతో పాటు.. పేదలకు రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం బదులు సన్నబియ్యం, ఇక వంద గజాల లోపు ప్లాటు వున్నవారికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రుణం.. ఇలా అనేకం చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని అనేక హామీలను కూడా ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇంతవరకు బాగానే వున్నా.. రాష్ట్ర అర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న అరోపణలతో రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచినా.. ఎలాంటి కొత్త పథకానికి శ్రీకారం చుట్టలేదు. రాష్ట్ర అర్థిక పరిస్థితి తెలిసి ఆచితూచి అడుగేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నా.. కొత్త పథకాల జోలికి పోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.

దీనికి తోడు ఆర్థిక మాంద్యం ప్రభావంతో.. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోయింది. కేంద్రం కూడా ఇంతకు ముందులా నిధులు, పన్నుల వాటాను త్వరగా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కేసీఆర్ సర్కారు ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఆర్టీసీ కార్మికులు 52 రోజులపాటు సమ్మె చేసినప్పటికీ.. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ ససేమిరా అంగీకరించలేదు. మీ అప్పులు, మీ తిప్పలు అని వదిలేశారు. వాళ్లంతట వాళ్లుగా ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ వదిలేశాక కొద్దిగా మెత్తబడ్డారు.

అయితే ఆర్టీసీ సమ్మెతో సంస్థకు నష్టం, జీతాలు రాక కార్మికులకు నష్టం.. కానీ ఈ రెండింటి నడుమ బస్సులు లేక ఇబ్బందులు పడిన ప్రయాణికులపై చార్జీల భారం బారెడు మోపి.. ప్రభుత్వం మన్నలను పొందింది. ఇక పెంచిన చార్జీలు వేరు.. అమల్లో పెరిగిన చార్జీలు వేరు. అయినా దీనిని వ్యతిరేకించడమో.. లేక నిరసన చేపట్టడమో ఏ పార్టీ వల్ల కాలేదు. అలా చేస్తే కార్మికులకు వారు శత్రువులుగా మారే ప్రమాదముందని.. ప్రజలైతే మర్చిపోతారని.. అన్ని రాజకీయ పార్టీలు అసలేమాత్రం పట్టనట్టుగా వ్యవహరించాయి.

తాజాగా మద్యం ధరలను పెంచుతూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పది శాతం చొప్పున పెంచారు. మద్యం ధరలను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్లు -రూ. 400 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని తెలంగాణ వాసి.. తన కష్టాన్నంతా డబ్బుగా మారిస్తే.. దానిని మద్యం ఆశ చూపుతున్న సర్కారు రేటు పెంచి జేబుకు చిల్లు పెడుతోంది. 2017లోనూ ప్రభుత్వం మద్యం ధరలను పది శాతం మేర పెంచిన సర్కార్ మళ్లీ మరో పది శాతం మేర ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దీనికి తోడు భూముల రిజిస్ట్రేషన్‌ విలువను పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు భారీగా పెరిగాయి. నూతన జిల్లాల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగడం.. హైదరాబాద్‌కు పరిశ్రమలు తరలి వస్తుండటంతో... రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో వాటి రిజిస్ట్రేషన్ విలువను కూడా పెంచాలని కేసీఆర్ సర్కారు యోచిస్తోంది. రిజిస్ట్రేషన్ విలువను పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. కేసీఆర్ తీరు చూస్తుంటే.. ఈ నిర్ణయాలతోనే ఆగిపోయేలా కనిపించడం లేదు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం.. ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మరిన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles