TRS Minister Malla Reddy Dance in Birthday Party బర్త్ డే పార్టీలో మంత్రి మల్లారెడ్డి డాన్స్.. అదుర్స్

Trs minister malla reddy dance in birthday function

Educational Institutions, Telangana Minister, MallaReddy, Birthday party, dance, Laawaris, amitabh bachchan song, Kishor kumar, Telangana, politics

Malla reddy and Chinna Malla reddy Educational Institutions Chairman and Telangana Minister Malla Reddy, who was an Member of parliament prior to becoming MLA nad Minister had a good move even in Dance. A video that goes viral shows that he is good in dance.

ITEMVIDEOS: బర్త్ డే పార్టీలో మంత్రి మల్లారెడ్డి డాన్స్.. అదుర్స్

Posted: 12/19/2019 04:52 PM IST
Trs minister malla reddy dance in birthday function

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేసి.. విద్యావేత్తగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. మేడ్చల్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో తన కళాశాలల రాకతో  చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఆ ప్రాంతమంతా ఇంజనీరింగ్, ఫామర్సీ కాలేజీలతో వెలుగొందుతోంది. మల్లారెడ్డి కాలేజీలతో పాటు తన సొదరుడు చిన్న మల్లారెడ్డికి చెందిన ఇంటజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో అదే ప్రాంతానికి పలు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఏర్పాటయ్యాయి. దీంతో ఆయనకు ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి కూడా ఏర్పాడింది.

మల్లారెడ్డి స్తానిక గ్రామాలకు చెందిన వ్యక్తులను అదే కాలేజీలలో నాన్ టీచింగ్ స్టాప్ గా నియామకాలు చేశారు. తన కాలేజీలతో ఆయా గ్రామా పంచాయితీలకు కూడా పన్నులు చెల్లిస్తూ.. ప్రత్యక్షంగా ఆక్కడి ప్రాంతాల అభివృద్దికి కూడా దోహదపడ్డారు. దీంతోనే ఆయనను తమ పార్టీలోకి అహ్వానించిన టీడీపీ అయనకు ఎంపీ పదవి అభ్యర్థిగా బరిలో దించగా, అయన ఘనవిజయం సాధించారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తరువాత ఆయన మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయన ఈ సారి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచి గెలుపోందడంతో.. ఆయనను మంత్రిగా తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఇలా విద్యావేత్త నుంచి రాజకీయ రంగానికి వెళ్లిన వ్యక్తి మల్లారెడ్డి.. ఇలా పదవులు, వ్యవహారాలతో ఫుల్ బిజీగా వున్నా,, ఆయనకు తెలియకుండానే వయస్సు పైబడింది. అయితేనేం ఆయన చాలా యాక్టివ్. ఎంతలా అంటే.. తన యవ్వనకాలంలో యావత్ దేశాన్ని ఉర్రూతలూపిన అమితాబ్ బచ్చన్ నటించిన లావారిస్ చిత్రంలోని పాటకు స్టెపులేశారు.

కిషోర్ కుమార్ పాడిన ఈ పాటపై అమితాబ్ అప్పట్లో డాన్స్ అదిరేలా వేశాడు. సరిగ్గా అదే డాన్సుతో అవే స్టెపులతో మల్లారెడ్డి అలరించారు. అప్నితో జైసీ తైసీ అనే పాటకు సంగీతానికి అనుగూణంగా స్టెపులేసి మరీ ఇరగదీసాడు. తాజాగా ఆయనకు డాన్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. పుట్టిన రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన డాన్సు అదిరింది. దీంతో ఆయననే ఈ పార్టీలో హైలైట్ అయ్యారంటే అతిశయోక్తి కాదు.. మరెందుకు ఆలస్యం మీరూ మినిస్టర్ మల్లారెడ్డి డాన్స్ వీడియోను వీక్షించండీ..  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles