Eating chillies cuts risk of death from heart attack ‘‘మిరపకాయలు తింటే గుండెపోటు ముప్పు తగ్గుతుంది’’

Eating chilli peppers four times a week reduces risk of death from heart attack

Molise, Epidemiology, chili pepper, Mediterranean Diet, Varese, dietitian, chilli peppers, heart attack, scientists, American College of Cardiology, Mediterranean diet, US

Eating chilli peppers has been linked to a lower risk of suffering a fatal heart attack. The study was carried out in Italy, and compared the risk of death among 23,000 people over eight years. It revealed the risk of dying from a heart attack was 40% lower among those eating chilli peppers at least four times a week, while death from stroke was more than halved as well.

మిరపకాయలు తింటే గుండెపోటు ముప్పు తగ్గుతుంది: అధ్యయనం

Posted: 12/19/2019 02:32 PM IST
Eating chilli peppers four times a week reduces risk of death from heart attack

గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉత్పన్నమైనా వైద్యులు చెప్పే మాట ఒక్కటే. బోజనంలో కాస్త ఉప్పు, కారం, నూనె తగ్గించమని. దీనినే గత కొన్ని దశాబ్దాలుగా రోగులు ఫాలో అవుతున్నారు. గుండె వరకు అవసరం లేదు.. కాసింత బీపి అధికమైనా సరే.. వైద్యలు చెప్పేది ఇదే.. దీంతో రక్తపోటులో ఏ మాత్రం తేడా కనిపించినా.. వైద్యులు వరకు వెళ్లడం ఇష్టం లేని రోగులు కూడా ముందుగా తమ వంతుగా ఉప్పు, కారం, నూనె లేకుండా చప్పగా తినడం ప్రారంభిస్తారు. కానీ తాజాగా ఉప్పు, నూనె విషయం అటుంచితే.. కారం అందులోనూ మిరపకాయ కారం తినడానికి గుండెపోటుకు సంబంధమేలేదని తేల్చారు వైద్యులు.

అంతేకాదు.. మిరపకాయలు తినడం ద్వారా గుండెపోటు ప్రమాదం తక్కువని కూడా చెబుతున్నారు. అదేంటి ఇన్నాళ్లు ఒకలా చెప్పిన వైద్యులు ఇప్పుడిలా చెబుతున్నారు. ఏది నిజం.? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.? అయితే తాజా పరిశోధనల్లో మిరపకాయలు గుండెపోటుకు కారకం కాకపోగా, గుండెపోటు ప్రమాదాన్ని కూడా నివారించే శక్తి కలిగివుందని తేలింది. మిరపకాయల్లో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గించే ‘క్యాప్ సేసియన్‌’ అనే పదార్థం ఉంటుందని దీని వల్ల గుండెకు రక్షణ కలుగుతోందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు.

ఈ వివరాలను అగ్రరాజ్యం ‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలోజీ’ జర్నల్‌లో ప్రచురించారు. భోజనంలో భాగంగా వారానికి నాలుగుసార్లు మిరప కాయలు తింటే గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని చెప్పారు. దాదాపు 23 వేల మందిపై పరిశోధనలు చేసి ఈ వివరాలను వెల్లడించారు. వీరంతా మెడిటెరేనియన్‌ డైట్‌ను అధికంగా తీసుకొనే మొలిస్‌ ప్రాంతానికి చెందిన ప్రజలని పరిశోధకులు చెప్పారు. వారి ఆహార అలవాట్లను ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు. ఈ కాలంలో 1,236 మంది మృతి చెందారని, వారిలో కేన్సర్‌, గుండెపోటు కారణంగా మూడొంతుల మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు.

మృతి చెందిన వారి వయస్సుతో పాటు వారి ఆహారపు అలవాట్లను పరిశోధకులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఫలితంగా వారానికి నాలుగుసార్లు ఆహారంలో మిరపకాయలను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉందని వారు గుర్తించారు. అయితే, వారానికి కనీసం నాలుగు సార్లు తినాల్సింది పచ్చి మిరపకాయలా? పండు మిరప కాయలా? అన్న విషయాలను వారు తెలపలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varese  Molise  Mediterranean Diet  Epidemiology  dietitian  chili pepper  Chilly peppers  Heart attack  

Other Articles