దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచార కేసులోని దోషులకు గతంలోనే ఉరిశిక్షను ఖరారు చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోమారు అదే తీర్పును వెలుగెత్తింది. హత్యాచార కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను విచారణకు స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయస్థాన విచారణపై సమీక్షను కోరే హక్కు దోషులకు లేదని.. అతడి పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దీంతో పాటు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అములు చేయనున్నట్లు కూడా ప్రకటించింది.
తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన అక్షరు కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎఎస్ బోపన్నాలతో కూడాన త్రిసభ్య ధర్మాసనం రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ మధ్యాహ్నం ఒంటి గంటకు తీర్పు వెలువరించింది. పునఃసమీక్ష అంటే పునఃవిచారణ కాదని, ఇప్పటికే ఈ కేసులోని అన్ని ఆధారాలను, సాక్ష్యాలను పరిశీలించిన పిమ్మట న్యాయస్థానం దోషులకు గతంలోనే ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని ధర్మసనం వెలువరించింది.
''రివ్యూ పిటిషన్ వేయడానికి నలుగురు దోషులు అనర్హులు.. రివ్యూ పిటిషన్ వేయడానికి ఎందుకొచ్చారు. వీరిపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం లేద''ని అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్ ను తిరస్కరించారు. నిర్భయ కేసుకు సంబంధించి నలుగురు దోషులను ఎప్పుడు ఉరి వేస్తారో తెలియాల్సి ఉంది. గతంలో ఉరి శిక్ష తీర్పును ఎలా ఇచ్చారో.. ఆ తీర్పుకు మరింత బలం చేకూరేలా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. కాగా, అక్షయ్ కుమార్ వేసిన రివ్యూ పిటీషన్ లో ‘ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఉంది.. దానిని ప్రతిరోజూ పీల్చుతూనే సగం చచ్చాం.. ఇక ఉరి శిక్షతో ఎందుకు పూర్తిగా చంపుతారు.. ఇలాగే ఈ గాలి పీల్చుతూనే చస్తామని పిటీషన్ లో పేర్కోన్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Mar 01 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్లో దొరికాయి. బ్యారేజ్ 53,... Read more
Mar 01 | అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి... Read more
Mar 01 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రీల్ 6వ తేదీన ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఇవాళ బిజీగా పర్యటించారు. ఇటీవల కేరళలోని కోల్లా జిల్లాలో మత్స్యకారులతో కలసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రాహుల్.. వారితో... Read more
Mar 01 | బంగారు నగల వ్యాపారితో పాటు ఆయన దుకాణానికి కాపలాగా ఉన్న ఓ కుక్కను నెట్ జనులు తిట్టిపోస్తున్నారు. నీ పని నువ్వు చేయకండా.. నీ జాతి కుక్కలకే అవమానాన్ని ఆపాదించిపెట్టావు అంటూ నెటిజనులు మండిపడుతున్నారు.... Read more
Mar 01 | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం (పీఎన్బీ స్కాం)లో ప్రధాన నిందితుడైన నిరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే... Read more