'Jai Visakha' placard creates tension at Amaravti protest అమరావతి అందోళనకారుల మధ్యలోకి ‘జై విశాఖ’.. ఉద్రిక్తత..

Amarvati protesters attack man after showcasing jai visakha placards

YS Jagan, Capitals, Jai Visakha, Jai Visakha placard, Amaravati protesters, mandadam villagers, Tension at Amaravati Farmers protest, Amaravati farmers indefinate fast, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

Tension prevailed in Andhra Pradesh after CM YS Jagan announcement on Three capitals for the state. Mandadam staged protest against CM's decision at Amaravati, where an unidentified person raised Jai Visakha slogan by holding a placard. Angry over the issue, locals thrashed him severely.

ITEMVIDEOS: అమరావతి అందోళనకారుల మధ్యలోకి ‘జై విశాఖ’.. ఉద్రిక్తత..

Posted: 12/18/2019 04:00 PM IST
Amarvati protesters attack man after showcasing jai visakha placards

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వుండే అవకాశాలు వుంటాయని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా సంకేతాలను ఇచ్చిన నేపథ్యంలో.. ఇది ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే నిర్ణయమంటూ దానిని విపక్షానికి చెందిన టీడీపీ, జనసేన వ్యతిరేకించాయి. ప్రాంతాల మధ్య అగ్గిరాజేసే నిర్ణయాన్ని వైఎస్ జగన్ ఎందుకు సంకేతాలు ఇచ్చారని నిలదీశారు. కమిటీ నివేదిక ఇవ్వకుండానే.. ఆ నివేదికలో ఏముందో కూడా తెలియకుండానే ఇలాంటి సంకేతాలు ఎవరైనా ఇస్తారా.? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.

కాగా వారి అనుమానాలను నిజం చేస్తూ అమరావతి మందడంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మూడు రాజధానుల సంకేతాల నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు అందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి సింగిల్ రాజధానిగా వుండాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతే ముద్దు.. మూడు వద్దు అంటూ వారు ప్లకార్డులు పట్టుకుని అందోళనకు దిగారు. వెలగపూడి, వెంకటపాలెంలోని రైతులు నిరాహార దీక్షలకు దిగగా.. మందడం ప్రాంత రైతులు రోడ్డుపైనే బైఠాయించారు.

సచివాలయం వైపు వెళ్లే రహదారి కావడంతో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. అయినా ఎక్కడి నుంచి వచ్చాడో ఒక వ్యక్తి ‘‘జై విశాఖ’’ అన్న ప్లకార్డు పట్టుకుని రైతులు నిరసనకు దిగిన ప్రాంతానికి చేరుకున్నాడు. వారిని కావాలని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడంతో నిరనస చేపట్టిన రైతులు కొద్దిసేపు షాక్ కు గురయ్యారు. ఇంతలో కొందరు యువకులు వెంటనే తేరుకుని ప్లకార్డు పట్టుకున్న వ్యక్తిపై వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో కొందరు సదరు వ్యక్తిపై దాడికి కూడా పాల్పడ్డారు.

అక్కడే వున్న పోలీసులు హుటాహుటిన సదరు వ్యక్తికి రక్షణ కల్పించేందుకు అక్కడికి కూతవేటు దూరంలో వున్న పోలిస్ స్టేషన్ కు తరలించారు. నిరసనకారులు అతడ్ని పట్టుకుని దాడి చేసేందుకు యత్నించగా.. పోలీసులు రక్షణతో స్థానిక యువకులను దాటుకుని సదరు అనుమానాస్పద వ్యక్తి పోలిస్ స్టేషన్ వరకు పరుగు పెడుతూ వెళ్లాడు. అయినా స్థానిక రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సదరు వ్యక్తిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. పోలిస్ స్టేషన్ ఎదుటే బైఠాయించారు. అందోళనకారులతో పోలీసు అధికారులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles