Special court sentences Musharraf to death సంచలనం.. పర్వేజ్ ముషారఫ్ కు మరణశిక్ష

Pervez musharraf sentenced to death in high treason case

Parvez Musharraf, Imran Khan, President, Pakistan President, musharraf death sentence, Treason case, Pervez Musharraf, Islamabad, Pakistan, Crime

Pakistan's former dictator Pervez Musharraf was sentenced to death in the high treason case by a special court here, becoming the first military ruler to receive the capital punishment in the country's history.

సంచలన తీర్పు: పాకిస్థాన్ ముషారఫ్ కు మరణశిక్ష

Posted: 12/17/2019 01:50 PM IST
Pervez musharraf sentenced to death in high treason case

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్ కు మరణశిక్ష పడింది. దేశ ద్రోహం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడి కేసును గతకొన్నాళ్లుగా విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మరణ శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఆ మేరకు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని అభియోగాలు ఎదర్కోన్న తరుణంలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదుకాగా, విచారణ జరిపిన పెషావర్ ప్రత్యేక కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇవాళ అయనను దోషిగా తేల్చి మరణశిక్షను ఖరారు చేసింది.

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడికి మరణ శిక్ష విధించడం పాకిస్థాన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2007లో అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్‌ పాకిస్థాన్ లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించారు. అనేక మంది న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో 2013 డిసెంబరులో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదైంది.

అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది. అయితే విచారణ జరుగుతుండగానే 2016 మార్చిలో ముషారఫ్‌ పాక్‌ విడిచి వెళ్లిపోయారు. కోర్టుకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. ముషారఫ్ న్యాయస్థానానికి రాలేదు. దీంతో ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఆయనకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ముషారఫ్ కు మరణశిక్ష విధించడాన్ని ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించగా.. ఒక న్యాయమూర్తి వ్యతిరేకించారు. ప్రస్తుతం ముషారఫ్‌ అనారోగ్య కారణాల రీత్యా దుబాయిలో చికిత్స తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Parvez Musharraf  Imran Khan  death sentence  Treason case  President  Pakistan President  Crime  

Other Articles