lovers fight on road at Mahalakshmi layout of Banglore నడిరోడ్డుపై లవర్ ని కొట్టిన ప్రియుడు.. పోలీసుల కౌన్సిలింగ్

Caught on cam lovers fight on road at mahalakshmi layout of banglore

Lovers Fight On Road, man slaps lover on Road, crime against woman, abuse on woman, Mahalakshmi Layout, Bangalore, karnataka, Crime

A person reportedly in love with a girl has lost his cool in the Bangalore outskirt. The person in a state of anger has slapped the girl on the road and he has reportedly abused the girl out of anger. The incident took place at the Mahalakshmi layout.

ITEMVIDEOS: నడిరోడ్డుపై లవర్ ని కొట్టిన ప్రియుడు.. పోలీసుల కౌన్సిలింగ్

Posted: 12/17/2019 12:54 PM IST
Caught on cam lovers fight on road at mahalakshmi layout of banglore

ప్రేమికుల మధ్య ఎంతసేపు రోమాంటిక్ వాతావరణమే వుండదు.. అప్పుడప్పుడు అలకలు, ఏడుపులు కూడా వుంటాయి. అయితే మరీ హద్దుమీరితే.. మాత్రం గూబలు కూడా గుయ్య్ మంటాయి. నమ్మశక్యంగా లేదా.? కానీ ఇది నిజం. యుక్తవయస్సు రాగానే ప్రేమ, ఆకర్షణలకు గురై తొందరపడే యువతీయువకులు ఈ విషయాలను కూడా తెలుసుకోవాల్సిందే. లేకపోతే ప్రేమ ఎంత మధురం అంటూ పాడుకోవడమే కాదు.. ఎంత కఠినం అని కూడా ఆలపించక తప్పదు. ఈ ఘటనను చూసైనా కళ్లు తెరవాల్సిందే. ప్రేమికుల కళ్లు తెరిపించే ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగింది.

నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవకు దిగిన ఘటన కర్ణాటకలోని బెంగుళూరు శివార్లలోని మహాలక్ష్మీ లేఅవుట్ ప్రాంతంలోగల బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాలిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. ఈ జంట బైక్‌పై వస్తూ ఓ చోట కిందకు దిగి వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో యువకుడు యువతిపై దాడికి యత్నించాడు. విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకునే యత్నం చేశారు. ఈ సమయంలో మరికొంత మంది అక్కడికి చేరుకుని దృశ్యాలను మొబైళ్లలో రికార్డు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని నిలదీశారు. ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, ఇంటిలో గొడవ కారణంగా ఇలా జరిగిందని చెప్పడంతో ఇద్దరిని పోలీసులు హెచ్చరించి పంపించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lovers Fight On Road  man slaps lover on Road  Mahalakshmi Layout  Bangalore  karnataka  Crime  

Other Articles