Isro successfully launches PSLV-C48 పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం విజయవంతం..

Isro successfully launches risat 2br1 9 foreign satellites

isro, RISAT-2BR1, PSLV-C48, Indian Space Research Organisation, CARTOSAT-3, foreign satellites, synthetic aperture radar

India's Polar Satellite Launch Vehicle (PSLV-C48) successfully took off from Indian Space Research Organisation's [Isro) space port. Into its 50th mission, the rocket is carrying India’s latest 'spy' satellite RISAT-2BR1 and nine foreign satellites.

పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం విజయవంతం..

Posted: 12/11/2019 03:56 PM IST
Isro successfully launches risat 2br1 9 foreign satellites

ఇండియన్ శాటిలైట్ రీసర్చ్ సెంటర్ (ఇస్రో) అంతరిక్ష రేసులో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇవాళ ప్రయోగించిన సీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటుసేవలు అందించనున్న ఈ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

పీఎస్‌ఎల్‌వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్‌–2బీఆర్‌1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్‌ అనే ఉపగ్రహాలు, టైవోక్‌–0129, ఆరు ఐహోప్‌శాట్‌ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్‌–సార్, ఇటలీకి చెందిన తైవాక్‌–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్‌–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. రిశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్‌-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగించారు.

ఇక ఇస్రో ప్రయోగాల్లో పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు ప్రత్యేక స్థానమున్నది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్‌ వెహికల్‌ అయిన పీఎస్‌ఎల్వీ.. చంద్రయాన్‌-1, మంగళ్‌యాన్‌ మిషన్లను విజయవంతం చేసింది. కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్‌-1,2, మంగళ్‌యాన్‌-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్ యాన్ కు సమాయత్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles