fraud cases on bike owners with unvisible number plates నెంబర్ ప్లేట్ స్పష్టంగా కనింపిచకపోతే.. షాక్ తగిలిద్దీ..

Traffic police to book fraud cases on bike owners with unvisible number plates

fraud cases on bikes with unvisible number plates, forgery cases on bikes with unvisible number plates, Rachakonda, cyberabad, Hyderabad, Traffic police, Bike, Number plates, Fraud case, Forgery case, Telangana

Hyderabad Traffic Police are giving shock to bike owners with unvisible number plates. In addition to Traffic section Fraud and Forgery cases are also booked on these bike owners.

నెంబర్ ప్లేట్ స్పష్టంగా కనింపిచకపోతే.. షాక్ తగిలిద్దీ..

Posted: 12/11/2019 02:55 PM IST
Traffic police to book fraud cases on bike owners with unvisible number plates

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి బైక్ నెంబర్ ప్లేట్ ను ఫోటోలు తీస్తూ.. అదునాథన రీతిలో వారికి ట్రాఫిక్ చాలానాలు పంపుతున్న క్రమంలో.. బైక్ యజమానులు కూడా వినూత్నంగా అలోచిస్తూ.. అందుకు పైఎత్తులు వేస్తున్నారు. దీంతో పలువురు వాహనదారులు చలానాలను తప్పించుకునేందుకు ట్రాఫిక్ పోలీసులపై కొత్త టెక్నిక్స్ వినియోగిస్తున్నారు. అయితే వాటన్నింటినీ ఉధ్దేశం మాత్రం తమ వాహన నెంబర్ కెమెరాకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడమే. ఇందుకోసం ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు.

ఈ టెక్నిక్స్ లో భాగంగా నాలుగు నంబర్ల వరస సంఖ్యలో ఒక అంకెను కనపడకుండా చేయ‌డం.. నంబర్ ప్లేటులో అక్షరాలు తొల‌గించ‌డం, సంఖ్యలను తుడిచివేయ‌డం.. సరిగ్గా రాయకుండా ఉండ‌టం....నంబర్లు సరిగ్గా కనపడకుండా చేయ‌డం. నంబ‌రు ప్లేటు వంచ‌డం... ట్రాఫిక్ పోలీసులను చూసినప్పుడు వాటిని కనపడకుండా చేయ‌డం.. తప్పుడు నంబర్ ప్లేటు పెట్టుకోవ‌డం.. లాంటివి చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసినా.. వారికి సగం నెంబరు మాత్రమే చిక్కడంతో.. వారు చాలానాలు వేయలేకపోతున్నారు. ఆలస్యంగా వాహనదారులు ఎత్తుగడపై దృష్టిసారించిన పోలీసులు.. ఇలాంటి వారికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇకపై నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలపై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 420(మోసం), సెక్షన్ 465(ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేయనున్నారు. తప్పుడు నెంబర్లు పెట్టుకుని తిరుగుతున్న వాహనా దారులను గుర్తించే పనిలోనే కొందరు పోలీసులు నిమగ్నం కానున్నారని సమాచారం. చార్జీషీట్లు విచారణకు వచ్చినప్పుడు.. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం చేసినా వారందరూ కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 12,314 మంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు వచ్చి, కనపడకుండా తిరిగారని గుర్తించారు. వీరందరీపై సాధారణ చలాన్ తో పాటు సెక్షన్ 420, 465ల కింద కేసులు నమోదు చేశారు. వీరందరీపై కోర్టులో తప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లను పెట్టుకుని తిరుగుతున్నారని నమోదు చేసిన అభియోగాలపై చార్జీషీట్లను దాఖలు చేస్తున్నారు. వీటిలో కోర్టు విచారణలో తప్పు అని నిర్ధారణ అయితే 420 సెక్షన్ కింద 7 ఏళ్లు, 465 కింద 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. కావునా..వాహనదారులు తమ నంబర్ ప్లేటు స్పష్టంగా కనపడేలా ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rachakonda  cyberabad  Hyderabad  Traffic police  Bike  Number plates  Fraud case  Forgery case  Telangana  

Other Articles