Telangana Commuters to Shell Out More on State Buses బస్సు చార్జీలు పెంపుతో ప్రయాణికులకు వాత

Telangana commuters to shell out more on state buses as hiked rates will kick in from midnight

bus rates, hiked bus fares, bus passes, ordinary, metro express, metro delux, student bus pass, Commuters, Hyderabad, Telangana

Commuters in Telangana brace for hiked bus fares as TSRTC's new rates are set to be applicable from Monday midnight. Residents will have to shell out more on City Ordinary, Metro Express and Metro Delux buses.

బస్సు చార్జీలు పెంచి.. ప్రయాణికులకు వాత పెట్టిన సర్కార్

Posted: 12/02/2019 05:03 PM IST
Telangana commuters to shell out more on state buses as hiked rates will kick in from midnight

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బస్సుల్లో కనీస ఛార్జీని అధికారులు వెల్లడించారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.15 కనీస ఛార్జీలను వసూలు చేయనున్నారు. డీలక్స్‌ బస్సుల్లో రూ.20, సూపర్‌ లగ్జరీల్లో రూ.25, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌ ఏసీ బస్సుల్లో రూ.35లను కనీస చార్జీలుగా నిర్ణయించారు. వెన్నెల ఏసీ స్లీపర్‌ కనీస ఛార్జీలను రూ.70కి పెంచారు. ఈ మేరకు కొత్త ధరలను టిమ్‌ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారు.

స్టూడెంట్ పాసుల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించినట్టు అర్థమవుతోంది. స్టూడెంట్ బస్ పాస్ ధర రూ.130 నుంచి రూ.165కి పెంచారు. సిటీ ఆర్డినరీ బస్ పాస్ చార్జీని రూ.770 నుంచి 950కి పెంచారు. మెట్రో బస్ పాస్ చార్జి రూ.880 నుంచి రూ.1070కి పెంచారు. మెట్రో డీలక్స్ బస్ పాస్ చార్జీని రూ.990 నుంచి రూ.1180కి పెంచారు. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలు కింది విధంగా ఉన్నాయి.

గ్రేటర్ పరిధిలో..
* గ్రేటర్ హైదరాబాద్‌లో రౌండింగ్ ధర రూ.5 యథావిధిగా కొనసాగనుంది. కనీస చార్జీ మాత్రం రూ.10గా నిర్ణయించారు.
* ఆర్డినరీ ప్రస్తుత కనీస ధర రూ.5గా ఉండగా.. రూ.10కి పెంచారు. గరిష్ఠ ధరను రూ.30 నుంచి రూ.35కు పెంచారు.
* మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కనీస ధర రూ.10 యధావిధిగా కొనసాగింపు. గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు.
* మెట్రో డీలక్స్ కనీస చార్జీ రూ.10 ఉండగా.. దాన్ని రూ.15కు పెంచారు. గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.45కు పెంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles