Disha murder case: shame to the entire country says Rajnath దిశ హత్యోదంతం దేశానికే అవమానకరం: రాజ్ నాథ్ సింగ్

Disha murder case shame to the entire country says rajnath

Priyanka reddy, veterinary doctor, disha, rajnath singh, kishan reddy, uttam kumar reddy, sonal mansingh, Ram Mohan naidu, Lok Sabha, Lok Sabha, Priyanka reddy murder, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, crimes against women, Telangana, Crime

Lok Sabha condemned the Veterinary Doctor Disha brutal gangrape and murder. Defence Minister Rajnath Singh said this act has brought shame to the entire country. It has hurt everyone. The accused must be given the most stringent punishment for their crime.

దిశ హత్యోదంతం దేశానికే అవమానకరం: రాజ్ నాథ్ సింగ్

Posted: 12/02/2019 04:10 PM IST
Disha murder case shame to the entire country says rajnath

వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసు ఘటనపై లోక్ సభలోనూ చర్చవచ్చింది. స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ అంశమై మాట్లాడారు. ఇలాంటి ఘటనలు యావత్ దేశానికే అవమానకరంగా వున్నాయిని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత.. తెలంగాణ వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యోదంతంపై చర్చించేందుకు సమయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనలు దేశంలోని ప్రతీ ఒక్కరిని బాధతో కదిలించాయని పేర్కోన్నారు. ఇక ఇలాంటి నేరాలకు పాల్పడిన నిందితులకు కఠినమైన శిక్షలు విధించక తప్పదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ కేసుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో ఓ మహిళా వైద్యురాలిని అపహరించి.. సామూహిక అత్యాచారం చేసి ఆ తరువాత.. అమెను దహనం చేసిన ఘటన చోటుచేసుకోవడం హేయకరమని అన్నారు. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడానికి వున్న కారణాల్లో ఒకటి మద్యపాన విక్రయాలని అన్నారు.

ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రాష్ట్రంలో మధ్యం లభిస్తోందని.. రాష్ట్రంలో జరిగే అన్ని అనార్థాలకు ఇదే కారణమవుతోందని అన్నారు. ఇక ఇలాంటి ఘటనలపై చట్టం తనపని తాను చేసుకుపోతోందని అంటే సముచితం కాదని.. సాధ్యమైనంత త్వరగా ఈ కేసులోని నిందితులకు కఠినమైన శిక్షలు పడాలని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి.. అత్యంత వేగంగా కేసును విచారణను పూర్తి చేసి నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ హత్యోదంతంపై లోక్‌సభలో మాట్లాడుతూ.. ఇవాళ దేశంలోని ప్రతీ ఒక్క యువతి భయపడుతోందని.. ప్రతి తల్లి, ప్రతి చెల్లి కూడా భయపడుతూనే ఉన్నారని ఎంపీ చెప్పారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించడం ఒక్కటే సరైన న్యాయమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. నిర్భయ ఘటన తర్వాత కూడా అత్యాచారాలు ఆగడం లేదని, అత్యాచార దోషులకు కఠినశిక్షలు పడేలా సమర్ధమైన చట్టాలు తేవాలని వ్యాఖ్యానించారు. మహిళ భద్రతపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి దిశ హత్యోదంత ఘటనపై మాట్లాడుతూ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాల సహాయం లభిస్తుందని అన్నారు. ఈ కేసు విచారణను అత్యంత వేగంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అని విధాలా సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు. ఈ కేసును వేగవంతంగా విచారించేందుకు కూడా కేంద్రం రాష్ట్రప్రభుత్వం అడిగే అన్ని వినతులను అందిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశంపై రాజ్యసభ సభ్యురాలు సోనాల్ మాన్ సింగ్ స్పందిస్తూ.. తాను ఇలాంటి వార్తలు వినేందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.

యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసే ఇలాంటి ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని అయినా మహిళా రక్షణ చర్యలు ఏక్కడా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. దేశంలోని నలు దిక్కులా ఇలాంటి ఘటనలు సంభివిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయని.. ఇలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు, పోలీసులు ఎందుకు, సివిల్ సోసైటీ సానుభూతి మానవత్వం ఏమయ్యాయని అమె ప్రశ్నించారు. ప్రతీసారి క్యాండిల్ లైట్లు, ర్యాలీలు జరుగుతున్నా.. ఎందుకీ దుర్ఘటనలు ఆగడం లేదని అమె ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles