దేశరాజధాని న్యూఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఓ భారీ కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. న్యూఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత సుబాష్ చోప్రా నేతృత్వంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ ప్రసంగిస్తూ.. తన పార్టీకి, పార్టీ జాతీయ నేతలకు జిందాబాద్ లు కొడుతూ ఒక పెద్ద పోరబాటు చేశాడు. అంతే ఇప్పుడా వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది.
ఈ వీడియో అంతగా వైరల్ కావడానికి సురేంద్ర కుమార్ అనే ప్రస్తుత మాజీ.. గతంలో మూడు పర్యాయాల ఎమ్మెల్యేగా వ్యవహరించిన నాయకుడి చేసిన పనే. తన ప్రసంగం ముగించుకుని ఇక సెలవు అనబోయే ముందు ఆయన కార్యకర్తలతో నినాదాలు చేయించారు. ఈ సమయంలో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబాష్ చోప్రా కూడా సురేంద్ర కుమార్ పక్కనే వుంటూ అతని చెప్పిన స్లోగన్లకు జై కోట్టారు. అంతే ఒక్కసారిగా ఆయన విస్మయం వ్యక్తం చేసి.. తేరుకుని వెంటనే సురేంద్ర కుమార్ వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు.
అసలు విషయం ఏమిటంటే.. సురేంద్ర కుమార్ నినాదాలు ఇస్తూ.. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ... అనగానే, కార్యకర్తలు జిందాబాద్ అన్నారు. ఆపై కాంగ్రెస్ పార్టీ... అనగానే మరోసారి జిందాబాద్ కొట్టారు. రాహుల్ గాంధీ... అనగానే అదే స్పందన. ఇక ఆ తరువాత.. ప్రియాంకా గాంధీ... అనాల్సిన సురేంద్ర పొరపాటున ప్రియాంకా చోప్రా... అనేశారు. కార్యకర్తలు ఏ మాత్రం తడుముకోకుండా జిందాబాద్ చెప్పేశారు. సుబాష్ చోప్రా విస్మయం చెంది.. సురేంద్ర కుమార్ కు విషయాన్ని సర్థి చెప్పడంతో ఆయన క్షమాపణలు చెప్పి.. ప్రియాంకా గాంధీ పేరును చెప్పి కార్యకర్తలతో జై కోట్టించారు.
#WATCH Delhi: Slogan of "Sonia Gandhi zindabad! Congress party zindabad! Rahul Gandhi zindabad! Priyanka Chopra zindabad!" (instead of Priyanka Gandhi Vadra) mistakenly raised by Congress' Surender Kr at a public rally. Delhi Congress chief Subhash Chopra was also present.(01.12) pic.twitter.com/ddFDuZDTwH
— ANI (@ANI) December 1, 2019
ఇక ఈ వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ముందురోజు రాత్రి ప్రియాంకా చోప్రా సినిమాను సురేంద్ర చూసివుంటారని అంటున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతకే అమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరు గుర్తు లేకపోవడం హేయకరమని కొందరు.. ప్రియాంకా చోప్రా కాంగ్రెస్ లో ఎప్పుడు మరికొందరు చేరారని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆయన పోరబాటు సహజమని సురేంద్రకుమార్ ను సమర్థిస్తున్నారు. నెట్టింట వైరల్ అయిన వీడియోను మీరూ చూడవచ్చు.
कांग्रेस पार्टी की रैली में प्रियंका चोपड़ा ज़िंदाबादके नारे लग रहे हैं
— Manjinder S Sirsa (@mssirsa) December 1, 2019
लगता है पूरी पार्टी ही पप्पू है pic.twitter.com/BLZLube4Po
(And get your daily news straight to your inbox)
Dec 10 | జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రశంసలు కురిపించారు. రాజకీయం కూడా వ్యాపారంగా మారిన నేటి తరుణంలో పవన్ కల్యాణ్ లాంటి నేతలు ప్రజలకు అవసరమని,... Read more
Dec 10 | దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ప్రకటన చేయడాన్ని భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే... Read more
Dec 10 | మెట్రో రైలు ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తీపి కబరును అందించింది. ఇకపై ప్రతి రోజు ఈ రైళ్లలో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రయాణికులకు జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలను హైదరాబాద్... Read more
Dec 10 | స్వతంత్ర్యం వచ్చే క్రమంలో కాంగ్రెస్ దేశాన్ని మత ప్రాతిపదికన రెండుగా విభజించి వుండకపోయివుంటే ఇవాళ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను... Read more
Dec 10 | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో.. తొలినాళ్లలో విమర్శలను ఎదుర్కోన్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.... Read more