amee yagnik calls for social reformation వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ నిర్ధేశం.. ‘‘బహిరంగ ఉరే సరి..’’

Disha murder case jaya bachchan says accused should be publicly lynched

Priyanka reddy, veterinary doctor, disha, venkaiah naidu, amee yagnik, jaya bachchan, gulam nabi azad, vijila sathyananth, nirbhaya, Priyanka reddy murder, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, crimes against women, chatanpally village, madhapur, shadnagar, lorry drivers, scooty, rachakonda police, Telangana, Crime

Rajya Sabha condemned the Veterinary Doctor Disha brutal gangrape and murder. Chairman M Venkaiah Naidu said What is required is not a new bill. What is required is political will, administrative skill, change of mindset and then go for kill of the social evil.

ITEMVIDEOS: వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ నిర్ధేశం.. ‘‘బహిరంగ ఉరే సరి..’’

Posted: 12/02/2019 01:29 PM IST
Disha murder case jaya bachchan says accused should be publicly lynched

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులోని నిందితులకు బహిరంగంగా ఉరి తీయడమే సరైన శిక్ష అని పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా మేధావుల సభైన రాజ్యసభలోని మహిళామణులు ఈ అభిప్రాయానికి వచ్చారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంపై ఇవాళ పార్లమెంటులో చర్చ జరిగింది. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత ఈ ఘటనపై చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా సమయాన్ని కేటాయించారు.

కాగా, రాజ్యసభలో ఈ అంశమై తొలుత మాట్లాడిన కాంగ్రెస్ పక్ష నేత గులాంనబి ఆజాద్.. దేశంలోని ఏ రాష్ట్రామూ, ఏ నేత ఇలాంటి ఘటనలు తమ రాష్ట్రంలో జరగాలని కోరుకోరని అన్నారు. అయితే ఈ అఘాయిత్యాలు అగాలంటే మాత్రం కేవలం చట్టాలను చేసినంత మాత్రన సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, శాశ్వతంగా నిర్మూలించేందుకు పార్లమెంటు మొత్తం ఐక్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని అజాద్ అన్నారు.

ఆ తరువాత ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు అమీ యాజ్ఞిక్ మాట్లాడుతూ.. తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయమై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశంలోని న్యాయ, చట్టసభలు, ఎగ్జిక్యూటివ్, సహా అన్ని వ్యవస్థలు ఒక్కతాటిపైకి వచ్చి సామాజిక సంస్కరణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని అమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ మేరకు అత్యవసర కోణంలో దీనిపై చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటి ఘటనలు నియంత్రించబడవని అమె అన్నారు.

మన దేశంలో మహిళలకు, పిల్లలకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు సురక్షితంగా లేకుండా పోతోందని అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు విజిల సత్యానంత్ అన్నారు. ఇలాంటి అభిప్రాయం వ్యక్తమవుతన్న నేపథ్యంలో సత్వర చర్యలు తీసుకోకపోతే దేశానికే ముప్పువాటిల్లే ప్రమాదముందని అమె అన్నారు. సభ్యసమాజంలో ఇలాంటి ఘటనలు పూర్తిగా నియంత్రించబడాలంటే తప్పనిసరిగా ఈ ఘోరానికి పాల్పడిన నలుగురు నిందితుల నేరాన్ని ఫాస్ట్ ట్రాకు కోర్టులో విచారించి ఈ ఏడాది చివరినాటికల్లా ఉరి శిక్ష విధించాలని కోరారు. న్యాయం ఆలస్యం అవ్వడం అంటే న్యాయం జరక్కపోవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ దిశ హత్యోదంతంపై మాట్లాడుతూ.. తాను ఇదే సభలో ఎన్నో పర్యాలు ఇలాంటి ఘటనలపై తన గళాన్ని వినిపించానని.. ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడే నిందితులను బహిరంగంగా శిక్షించడం ఒక్కటే మార్గమని అమె అభిప్రాయపడ్డారు. ఇది చాలా బాధకరం.. హింసాత్మకమే అయినా.. ఇలాంటి నేరాలకు పాల్పడితే శిక్ష కూడా అంతే కఠినంగా వుంటే తప్ప.. నేరాలు అదుపులోకి రావన్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా.? అని ప్రజలు అడిగే తరుణం వచ్చిందని అన్నారు.

ఇక తెలంగాణలోని అత్యాచార ఘటనలో అదే ప్రాంతంలో ఒక్క రోజు ముందు సరిగ్గా అలాంటి ఘటనే మరోకటి జరిగిందని.. అయినా పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకోలేదని అమె మండిపడ్డారు. నేరం జరిగిన ప్రాంతంలో పోలీసులు గస్తీ కూడా లేకపోవడం ఏంటని అమె ఫైర్ అయ్యారు. మహిళలపై హత్యాచార ఘటనలు జరుగుతున్న క్రమంలో అక్కడి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని అమె ప్రశ్నించారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సమాజం ముందు చేతకానివారిగా నిల్చోబెట్టాలని అమె పేర్కోన్నారు. ఇక ఇలాంటి ఘటనలు ఇతర దేశాల్లో జరిగితే అక్కడి ప్రజలే వారికి న్యాయం చేస్తారని, అలాగే మన దేశంలోనే బహిరంగ ఉరిశిక్షను వేయాలని అమె అన్నారు.

కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని తెలిపారు. మరోవైపు దిశఘటనపై దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. నల్ల రిబ్బన్లతో వీరంతా ఆందోళన చేపట్టారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ ఫర్‌ దిశ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles