slain Tahsildar’s attender too succumbs to burns నెలరోజుల పోరాటం.. అటెండర్ చంద్రయ్య మరణం..

Attender of slain tahsildar vijaya reddy succumbs to burn injuries

Vijaya Reddy, Telangana Tahsildar murder, Telangana Tahsildar attender, Abdullapurmet MRO office attender, Abdullapurmet MRO Vijaya Reddy, Chandraiah, MRO burnt alive, Mandal Revenue Officer, Abdullapurmet, Rangareddy district, Telangana, Crime

Chandraiah, an attender of Abdullapurmet Tahsildar office, who sustained burns when trying to rescue Tahsildar Vijaya Reddy when she was set ablaze on November 3, died while undergoing treatment

నెలరోజుల పోరాటం.. ఎమ్మార్వో అటెండర్ చంద్రయ్య మరణం..

Posted: 12/02/2019 11:58 AM IST
Attender of slain tahsildar vijaya reddy succumbs to burn injuries

తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం కేసులో నెల రోజుల పాటు మరణంతో పోరాటం చేసిన అటెండర్ చంద్రయ్య ఇవాల తెల్లవారు జామూన మరణించారు. గత నెల 2న ఎమ్మార్వో విజయారెడ్డి కార్యాలయంలోకి పెట్రోల్ సీసాతో వచ్చిన సురేష్ అనే వ్యక్తి అమెతో భూమి విషయమై గొడవపడి.. అత్యంత దారుణంగా అమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనలో ఇవాళ మరో ప్రాణం బలైపోయింది.

నెల రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న అబ్దుల్లాపూర్ మెట్ అటెండర్ చంద్రయ్య.. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుకు గురై మరణించారు. మంటల్లో చిక్కుకున్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్‌ చంద్రయ్య మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. కాలిన గాయాలతో… డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందతున్న చంద్రయ్య ఆరోగ్యం అదివారం నుంచే విషమించింది. దీంతో కుటుంబ సభ్యుల్లో అందోళన రేగింది. అయితే 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితిని చెప్పలేమని డాక్టర్లు.. తెలిపిన గంటల వ్యవధిలోనే ఆయన కన్నుమూశారు.

ఎమ్మార్వో విజయారెడ్డిపై జరిగిన దాడి నుంచి అమెను కాపాడబోయి.. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఘటన తరువాత ఆయనను కూడా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కంచన్ బాగ్ లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఇప్పటికే ఈ ఘటనలో విజయారెడ్డి, డ్రైవర్, నిందితుడు సురేష్ కాలిన గాయాలతో చనిపోగా… తాజాగా చంద్రయ్య కూడా చనిపోవటంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Cops parade bar dancers for safety check probe launched

  భద్రత కోసమే.. అభద్రతాభావంతో.. బార్ గర్ల్స్ వీడియో వైరల్..

  Dec 09 | ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను... Read more

 • Buxar jail in delhi preparing hanging ropes for nirbhaya case convicts

  నిర్భయ దోషులకు అదే రోజున ముహూర్తం ఫిక్స్..?

  Dec 09 | అది 2012, డిసెంబర్‌ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే... Read more

 • Anam ramnarayana requests speaker to change his place

  ‘‘సీటు మార్చండీ అధ్యక్షా’’ నవ్వులు పూయించిన ఆనం రిక్వెస్ట్..

  Dec 09 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ... Read more

 • Andhra pradesh government announces mega dsc for 7900 post

  నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

  Dec 09 | ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో... Read more

 • Man dies in queue for subsidy onions in gudiwada

  వృద్దుడి ఉసురు తీసిన ఉల్లి.. గుడివాడలో ఘటన

  Dec 09 | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి..... Read more

Today on Telugu Wishesh