టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో అచ్చెన్నాయుడి చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కారులో ఉన్న గన్ మన్ సహా మరికొందరికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
నిన్న గుంటూరులోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు ప్రమాద వార్త తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యారు. టీడీపీ దివంగత నేత, పార్లమెంటు సభ్యుడు ఎర్రంనాయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడని తెలసి అచెన్నాయుడు అనుయాయువులు అందోళనకు గురయ్యారు. అయితే, ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 09 | ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను... Read more
Dec 09 | అది 2012, డిసెంబర్ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే... Read more
Dec 09 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ... Read more
Dec 09 | ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో... Read more
Dec 09 | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి..... Read more