Rachakonda police helping woman; tweets goes viral పెట్రోల్ పోసి సాయం చేసిన రాచకొండ పోలీసులు

Rachakonda police helping woman tweets goes viral

woman, petrol, dail 100, sowbhagya nagar, lb nagar, hyderabad, rachakonda police, telangana, social media, crime

A Photo and a news clip of a telugu daily of Rachakonda poLice, is doing rounds in social media, The matter ia about a woman sought help of #Police making a call to #Dial_100, #Blue_Colts staff of LB nagar Police Station responded to it swiftly and helped her.

పెట్రోల్ పోసి సాయం చేసిన రాచకొండ పోలీసుల ట్వీట్ వైరల్..

Posted: 11/30/2019 12:02 PM IST
Rachakonda police helping woman tweets goes viral

శంషాబాద్ కు చెందిన డాక్టర్ ప్రియాంక ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఫోన్ కాల్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు చేసిన సాయం విషయమై ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. అదెలా అంటే.. ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిందంటూ ఓ యువతి 100కు డయల్ చేస్తే స్పందించిన పోలీసులు.. నేరుగా పెట్రోల్ బంకుకు వెళ్లి ఓ బాటిల్ లో పెట్రోల్ తీసుకుని వచ్చి.. యువతి స్కూటీలో పోసి అమెకు తామున్నామన్న భరోసా కల్పించారు.

తెలంగాఱ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిందీ ఘటన. రాచకొండ పోలీసులు ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ లో పెట్టిన పోస్టు.. దానికి జతగా పెట్టిన ఓ దినపత్రిక క్లిప్.. ఇప్పుడు నెట్టంట్లో తెగ వైరల్ అవుతోంది. వరుస అత్యాచార ఘటనలతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌లో  పోలీసులు ఇప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పోలీసు వర్గాలు పేర్కోంటున్నాయి. ఈ ఘటన తాలుకు వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ యువతి ద్విచక్రవాహనంలో పెట్రోల్ అయిపోయింది.

చీకటిపడుతున్న సమయంలో ఇలా జరగడంతో అమె కొంత అందోళనకు గురైంది. ప్రియాంక హత్యోదంతం నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు, మంత్రుల, నెట్టింట్లో ఫోన్ నెంబర్లు తన వాటాప్ లో నిండిపోవడంతో.. అమె డయల్ 100కు కాల్ చేసి బండిలో పెట్రోలు అయిపోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలు బాటిల్ తో యువతి వద్దకు చేరుకున్నారు. స్కూటీలో వాహనం పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు. యువతి ఫోన్‌‌కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  అయిత ఘటన జరిగిన నేపథ్యంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇలానే ప్రతిస్పందిస్తే.. ఇక రాష్ట్రంలో మహిళలకు 100 నెంబరే రక్ష ఉంటుందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  petrol  dail 100  sowbhagya nagar  lb nagar  hyderabad  rachakonda police  telangana  social media  crime  

Other Articles