BJP shameless attempts to subvert democracy: Sonia Gandhi బీజేపివి నీతిమాలిన చర్యలు.. పీఎస్యూలు స్నేహితులకు..

Bjp making shameless attempts to subvert democracy in maharashtra sonia gandhi

sonia gandhi, ncp, congress, ajit pawar, uddav thackarey, PM Modi, Amit Shah, Shivsena, BJP, maharashtra floor test, Devendra Fadnavis, maharashtra floor test, Maharashtra government formation, NCP, sharad pawar, shiv sena, supreme court, national politics

Congress interim president Sonia Gandhi on Thursday hit out at the BJP accusing it of making shameless attempts to “subvert democracy” in Maharashtra and has accused the Centre of selling profit-making PSUs to friends of the PM.

బీజేపివి ‘మహా’నీతిమాలిన చర్యలు.. పీఎస్యూలు స్నేహితులకు..

Posted: 11/28/2019 05:35 PM IST
Bjp making shameless attempts to subvert democracy in maharashtra sonia gandhi

బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ఆ పార్టీ సిగ్గుమాలిన చర్యలకు ప్రయత్నించిందని సోనియా దుయ్యబట్టారు. దేశంలోని లాభాలబాటలో పయనించే పీఎస్యూలను కూడా ప్రధాని తన స్నేహితులకు కట్టబెడుతు దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నారని అమె దుయ్యబట్టారు. నమ్మెదించిన పారిశ్రమిక ప్రగతిని బూచీలా చూపుతూ పబ్లిక్ సెక్టార్ యూనిట్లను స్నేహితులకు అమ్మేస్తున్నారని అమె ధ్వజమెత్తారు.

న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ... మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీపై కూడా సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన గవర్నర్.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సూచనలతో నడుచుకున్నారని.. ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదని అమె మండిపడ్డారు. గవర్నర్ కోశ్యారీ అనుసరించి విధానం తీవ్రంగా ఖండించదగినది విషయమని ఆమె అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి విచ్ఛిన్నం కావడానికి బీజేపీ అహంకారం, అతి విశ్వాసమే కారణమన్నారు.

మహావికాస్ అఘాడీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు.. కానీ, సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మోదీ-షా ప్రభుత్వం పూర్తిగా వెనక్కుతగ్గిందన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యలను అడ్డుకోవాలనే సంకల్పంతో మూడు పార్టీలు ఐక్యంగా పనిచేస్తాయని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మర్యాదపూర్వకంగా పతనమైందని, దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఎలా అధిగమించాలో మోదీ- షా ద్వయానికి స్పష్టత లేదని ఆరోపించారు.

దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతుందని, వృద్ధిరేటు మందగించి, నిరుద్యోగం పెరిగిపోయి, పెట్టుబడులు కూడా తగ్గిపోయాయని సోనియా ధ్వజమెత్తారు. రైతులు, వ్యాపారులు, చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగరేటు పడిపోయిందని, ఎగుమతులు మందగించాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని చెప్పారు.

సమస్యను పరిష్కరించడానికి బదులుగా మోడీ-షాలు గణాంకాలతో ప్రజలను మోసగించడంలో బిజీగా ఉన్నారని, వాస్తవాలను తెలియజేయడం లేదని సోనియా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ రంగం కొంతమంది మోదీ అనుకూల వ్యాపారవేత్తలకు అమ్ముడయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే ఆ సంస్థల్లో పనిచేసే వేలాది మంది కార్మికుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో డిపాజిట్లపై సాధారణ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. రీజనల్ కాంప్రహెన్షివ్ ఎకనమిక్ పాలసీతోపాటు ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దుపై కూడా సోనియా విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh