మహారాష్ట్రలో నూతన శకం మొదలైంది. శివ సైనికుడిని మరాఠా సీఎం పీఠంపై కూర్చోబెడతామంటూ ఠాక్రే చేసిన శపథం ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారంతో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన మూడో వ్యక్తిగా ఉద్దవ్ థాకరే నలిచారు. మనోహర్ జోషీ, నారాయణ్ రాణే తరువాత ఉద్దవ్ థ్రాకే ఈ పీఠాన్ని అధిరోహించారు. ముంబైలోని శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు.
ఈ ప్రమాణస్వీకారోత్సవంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా ఉద్ధవ్ చరిత్ర సృష్టించారు. ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్‌నాథ్ ముండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ కేత్‌లు ప్రమాణం చేశారు. దీంతో నెలరోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలుతీరింది. మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ సేవలు అందించనున్నారు.
గత నెల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలపై విభేదాలు రావడంతో వారి కూటమి విచ్ఛిన్నమైంది. ఈ నేపథ్యంలో అనేక మలుపులు తిరిగిన మహా రాజకీయాలు చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో సద్దుమణిగింది. సరిపడ బలం లేనికారణంగా బలపరీక్షకు ముందే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. అనంతరం రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో మహా వికాస్ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి.
ఉద్ధవ్ ఠాక్రేను కూటమి నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఎమ్మెల్యేగానూ, ఎమ్మెల్సీగానూ కాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్న 8వ నేతగా ఉద్దవ్ నిలిచారు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్ ఠాక్రే, సుశిల్ కుమార్ షిండే, ఎంకే స్టాలిన్‌లు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 18 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోమారు పరాభవం ఎదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని అమె తరపున... Read more
Jan 18 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల కమీషన్ మ్రోగించిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్డును... Read more
Jan 18 | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు తెలుగు ప్రజల ఇలవేల్పుగా కొంగుబంగారమైన విషయం తెలిసిందే. కాగా, తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ముందు భక్తులు ముందుగా వరహామూర్తి దేవాలయంలో ఆయన దర్శనం చేసుకోవాలన్న నానుడి... Read more
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more