BJP MLA sex video creates heat, before by-polls in karnataka కర్ణాటకలో వేడి రాజేస్తున్న ఎమ్మెల్యే అశ్లీల వీడియో..

Bjp mla sex video creates heat before by polls in karnataka

BJP MLA sex video, karnataka by-elections, Raghavendra, Uday Kumar, Honey trap, CCB police, viral video, karnataka, politics

Karnataka BJP MLA intimate video goes viral on net just before the Byelections creating heat in politics, MLA complaints on the same to police and says he has been haney traped. CCB police arrested four people along with a young girl regarding this case.

కర్ణాటకలో వేడి రాజేస్తున్న ఎమ్మెల్యే అశ్లీల వీడియో..

Posted: 11/28/2019 11:21 AM IST
Bjp mla sex video creates heat before by polls in karnataka

కర్ణాటకలో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే శృంగార వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. గదగ్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఓ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, రోణ ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వీడియోపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కూడా తానే స్వయంగా పోలీసులకు పిర్యాదు చేసి.. తనను బ్లాక్ మెయిల్ చేసిన వారిని అరెస్టు చేయాలని కోరాడం చర్చనీయాంశంగా మారింది. తనను హనీట్రాప్ చేసిన బ్లాక్ మెయిల్ చేశారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కోన్నారు.

ఈ విడియోలో ఎమ్మెల్యేతో పాటుగా కనిపిస్తున్న రాఘవేంద్ర, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియో పొందుపర్చిన పెన్ డ్రైవ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనతో పాటు పలువురు శాసనసభ్యులను రాఘవేంద్ర ట్రాప్ చేశాడని పోలీసులు విచారణలో తెలింది. వీరితో పాటు బడా బిజినెస్ మన్లను కూడా రాఘవేంధ్ర హనీట్రాప్ చేశాడని వారందరినీ బెదిరించి భారీ స్తాయిలో డబ్బును డిమాండ్ చేసారని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.

గడగ్ జిల్లాకు చెందిన బీజేపి ఎమ్మెల్యే సెక్స్ వీడియో 2017లో ఫిబ్రవరి 25న తీసినట్లుగా దానిపై రికార్డు అయ్యింది. అయితే 2017లో కాకుండా వీడియో బయటకు వచ్చిన ఈ తరుణంలో పోలీసులకు పిర్యాదు చేయడంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఈ కేసులో రాఘవేంద్రకు అండగా నిలుస్తున్నాడన్న అనుమానాలపై మాజీ ఎమ్మెల్యే శ్రీశైలప్ప బిరదూరుకు అల్లుడైన ఉదయ్ దేశాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోను ఎప్పుడు తీశారన్న విషయమై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ అశ్లీల వీడియో వ్యవహారం, ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ కాక పుట్టిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles