Deputy CM Caught on Camera distributes cash కర్ణాటక ఉపముఖ్యమంత్రిపై చర్యలుండేనా.? ఈసీ దారెటు..

Karnataka dy cm govind karjol in hot water after cash video surfaces

Govind Karjol, Dy CM, B S Yediyurappa, Cash for votes, BJP, karnataka by-elections, Athani, Mahesh Kumathalli, Election commission, Prakash Rathod, Congress MLC viral video, karnataka, politics

A day after a video of Deputy Chief Minister Govind Karjol allegedly distributing money went viral, the Congress has filed a complaint with the Election Commission alleging violation of the model code of conduct.

ITEMVIDEOS: డబ్బలిస్తూ కెమెరాకు చిక్కిన ఢిప్యూటీ సీఎం.. వార్నింగ్..!

Posted: 11/28/2019 12:39 PM IST
Karnataka dy cm govind karjol in hot water after cash video surfaces

కర్ణాటకలో అధికార బీజేపీకి ఉప ఎన్నికల ముందు వీడియోలు కాకపుట్టిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే శృంగార వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగానే.. స్వయంగా ఉప ముఖ్యమంత్రి గొవింద్ కార్జోల్ తానే స్వయంగా డబ్బులు ఇస్తున్న వీడియో ఒకటి బయటపడింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేసిన కాంగ్రెస్ ఈ మేరకు డిమాండ్ చేస్తోంది. ఉపముఖ్యమంత్రి హోదాలో గొవింగ్ కర్జోల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఎన్నికల నిబంధనలకు తూట్లు పోడుస్తూ యధేశ్చగా డబ్బులు పంచారని కాంగ్రెస్ అరోపిస్తోంది.

కర్ణాటకలో స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ ఎన్నికల సంఘం అధికారులను కోరారు. ఎన్నికలకు ముందే మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అభ్యర్థులు యధేశ్చగా డబ్బును పంచుతూ, ఖరీదైన బహుమానాలను ఇస్తూ పట్టుబడుతున్న క్రమంలో ఇక ఎన్నికల వేళ ఎలాంటి పరిణమాలకు పాల్పడుతారోనన్న భయాందోళన ఓటర్లలో కలుగుతుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. వీడియోలో ఉపముఖ్యమంత్రి మీడియా వారిని కూడా ఈ వీడియో క్లిప్ ప్రసారం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారని కూడ ఆయన పేర్కోన్నారు.

తాను డబ్బులిస్తున్న విషయాన్ని మీడియా సిబ్బంది వీడియో తీస్తుండగా, ఆయన వారిని ఈ విషయాలను రికార్డ్ చేయకండీ అంటూ ఆయన చెప్పడం, ఈ సంఘటనను రికార్డ్ చేయడాన్ని ఆపివేయమని వీడియోగ్రాఫర్‌లను ఆదేశించడం.. ఆనక హెచ్చరించడం కూడా రికార్డ్ అయ్యింది. దీంతో అధికారంలోని బీజేపి ప్రభుత్వం ఎంతటి దారుణానికైన ప్రాల్పడే అవకాశాలు వున్నాయని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది. ఈ ఘటన బీజేపి అభ్యర్థి మహేష్ కుమతహల్లి పోటీచేస్తున్న అత్తాని నియోజకవర్గ పరిధిలో జరగింది. ఇక్కడకు వచ్చని ఉపముఖ్యమంత్రి బీజేపి కార్యకర్తలకు డబ్బులు పంచుతూ కెమెరాలకు చిక్కాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles