Women Caught Wearing 9 Pairs Of Jeans కి‘లేడీ’ దొంగ ఉపాయం.. పసిగట్టిన వైనం..

Viral video woman caught shoplifting wearing 9 pairs of jeans

shoplifting video, shoplifting viral video, shoplifting video jeans, women theif, garments, clothing store, Venezuela, woman shoplifts jeans, woman steals jeans, woman steals jeans video, woman shoplifts 8 jeans by wearing them at once, new viral video, latest viral video, viral video 2019, shoplifting videos, shoplifting hacks, video viral, video virales, Viral, Trending, viral video, social media, Crime

A woman was recently caught shoplifting denim jeans in a very strange and mindboggling way from the clothing store. She was caught in a clothing store in Venezuela wearing eight pair of jeans on top of her own in order to steal all of them. The video of her has gone viral over the social media where she is removing one pair of jeans after the other on being caught.

ITEMVIDEOS: వైరల్ వీడియో: కి‘లేడీ’ దొంగ ఉపాయం.. పసిగట్టిన వైనం..

Posted: 11/27/2019 04:28 PM IST
Viral video woman caught shoplifting wearing 9 pairs of jeans

ప్రపంచంలోని 84 కళల్లో చోరీ కళ కూడా ఒక్కటి అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ మనిషీ ఈ కళను తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో వినియోగించినవాడే. అయితే ఈ కళను బాగా ఒంటబట్టించుకున్న ఓ మహిళ.. వినూత్నంగా తన కళను ప్రదర్శించింది. అయితేనేం మేమేం తక్కువా అన్నట్లు వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బంది అమెను అడ్డగించి.. అమె వేసుకున్న జీన్స్ ఫ్యాంట్లను విప్పించారు. అప్పటివరకు దుకాణాదారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని అనుకున్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. ఔరా ఇంతటి కళానైపుణ్యం కూడా సాధ్యమేనా.? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విద్యను భారత్ లోనూ అవలంభిస్తే.. దుకాణాలు మూసివేసుకోవడం మినహా మరే మార్గం వుండదని షాపు యజమానులు అందోళన చెందుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. వెనిజులాలోని ఓ యువతి జీన్స్‌ వస్త్ర దుకాణానికి వెళ్లింది. ఏవో వస్తువులను షాపింగ్ చేస్తున్నట్లు కాసింత సేపు బిల్డప్ ఇచ్చింది. అమె ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఎనమిది జీన్స్ ఫ్యాంట్లను ట్రయల్ రూమ్ లోకి తీసుకెళ్లింది. అయినా కొద్దిసేపటికి అమె ఎలాంటి వస్త్రాలు కొనుగోలు చేయకుండా వట్టి చేతులతోనే దుకాణం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది.

తీరా ఆమె తీరును గమనించి అనుమానం కలిగిన దుకాణ సెక్యూరిటీ గార్డులు అమెను పట్టుకుని యజమాని వద్దకు తీసుకువచ్చారు. యజమాని ఏం జరిగిందో చెప్పమని లేదంటే పోలీసులకు అప్పగిస్తామని చెప్పడంతో అమె తన చోరీ కళను తెలిపింది. అది విని నిర్ఘాంతపోయిన యజమానులు.. ఓ గదిలోకి తీసుకువెళ్లి అమె ధరించిన ఫ్యాంటు విప్పాలని అన్నారు. అంతే వారి అదేశాల మేరకు ఆమె తాను ధరించిన ఫ్యాంటులను విప్పింది. అయితే అమె ఒకటి రెండు కాదు ఏకంగా ఎనమిది ఫ్యాంట్లను విప్పింది.

అమె ట్రయల్స్ రూమ్ లోకి తీసుకెళ్లిన ఎనమిది ఫ్యాంట్లను ధరించి.. ఏమీ తెలియనట్టుగా వెళ్లిపోబోయింది. ఎనిమిది ప్యాంట్లను ఒకదానిపై ఒకటి తొడుక్కుని చోరీ చేసేందుకు ప్రయత్నించడంతో యాజమానులు వాటిని అమెతోనే విప్పించారు. ఇలా విప్పుతున్న క్రమంలో వీడియోను కూడా తీశారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మెండోజా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా.. కొద్ది క్షణాల్లోనే 4.2 మిలియన్లకు పైగా వీక్షించారు. పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘చోరీలు చేయడంలో నేర్పరి’ అని చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles