పొల్లాచ్చి అత్యాచార ఘటన స్పందించి తన చేజేతులా కష్టాలను కొనితెచ్చుకున్నారు దర్శకుడు, నటుడు భాగ్యరాజా. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వారే కారణమంటూ ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే తమిళనాట అగ్గిరాజేసిన ఈ వ్యాఖ్యాలపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు.
అత్యాచార ఘటనలపై దారుణ వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల మహిళలపై దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపించే సినీ రంగానికి చెందిన భాగ్యరాజా బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలకు ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భాగ్యరాజాపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే విషయంపై తమిళనాడు ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానని చెప్పారు.
ఓ కార్యక్రమంలో భాగ్యరాజా మాట్లాడుతూ, వివాహేతర సంబంధాల కోసం ఈరోజుల్లో కొందరు భార్యలు ప్రియులతో కలసి భర్తలు, పిల్లల్ని చంపేస్తున్నారని అన్నారు. సెల్ ఫోన్ల వల్ల మహిళలు చెడిపోతున్నారని.. రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని చెప్పారు. వారిపై అత్యాచారాలు, వేధింపులకు ఇది కూడా ఒక కారణమని అన్నారు. పొల్లాచ్చి అత్యాచార ఘటనలో మగవాళ్ల తప్పు ఏమాత్రం లేదని భాగ్యరాజా చెప్పారు. ఆ అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే అత్యాచారం జరిగిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
May 18 | పూర్వ కాలంలో ఆహారం వేరు. వాళ్లు ఎక్కువగా సిరిదాన్యాలతో కూడిన ఆహారం అందులోనూ ఎక్కువగా రోటీల రూపంలో తీసుకునేవారు. వాటితో వారికి కావాల్సినంత బలం అందడమే కాదు.. ఎలాంటి రోగాలనైనా ఎదుర్కోనే రోగనిరోధక శక్తి... Read more
May 18 | గుజరాత్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్... Read more
May 18 | సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ వైఎస్ జగన్... Read more
May 18 | విద్యార్ధులకు విద్యాబుద్దులు చెప్పి..వారిని సన్మార్గంలో నడిచేలా చేస్తూ.. తప్పుఒప్పులను సరిచేయాల్సిన బాధ్యత ఉన్న పాఠశాల యాజామాన్యం.. తప్పును తప్పని చెప్పలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు, తమ గూటికి చెందిన... Read more
May 17 | నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతూ పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు రోజుకో పూట బోజనం కూడా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు కారణమైన... Read more