Parliament adjourned on Maha political situation ఉభయ సభలను కుదిపేసిన ‘మహా’ రచ్చ..

Parliament adjourned on maha political situation

ajit pawar, BJP, Devendra Fadnavis, maharashtra floor test, Maharashtra government formation, NCP, sharad pawar, shiv sena, supreme court, winter session, parliament, lok sabha, rajya sabha, national politics

Congress members jostled with the marshals in the Lok Sabha when they stormed the Well of the House carrying placards, leading to adjournment of Parliament proceedings. Both Lok Sabha and Rajya Sabha have been adjourned till 2pm amid vociferous protests by Congress MPs over the political situation in Maharashtra.

ఉభయ సభలను కుదిపేసిన ‘మహా’ రచ్చ.. పార్లమెంటులో గంధరగోళం..

Posted: 11/25/2019 01:17 PM IST
Parliament adjourned on maha political situation

మహారాష్ట్రలోని రాజకీయ పార్టీని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు ఓ వర్గంతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపికి తీరుకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు ఉభయసభలను స్థంభింపజేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. లేచి.. తాను ఇవాళ హౌజ్ లో ఓ ప్రశ్నను అడగాలని అనుకుంటున్నానని.. అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఈ తరుణంలో ఈ ప్రశ్న అడగటం అసలు అర్థరహితమని భావిస్తున్నానని అన్నారు.

దీంతో కాంగ్రెస్ సభ్యలు వెల్ లోకి చోచ్చుకెళ్లి మహారాష్ట్రలో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై నిరసనను వ్యక్తం చేశారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో లోక్ సభలోకి పెద్ద బ్యానర్ పట్టుకుని వచ్చి.. నిరసన తెలుపుతున్న ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు హిబి ఈడెన్, టీఎన్ ప్రథాపన్ లను స్పీకర్ ఓం బిర్లా సభను బయటకు వెళ్లాల్సిందిగా అదేశించారు. అయితే వారు నిరసన కొనసాగిస్తుండగా, వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించారు. ఈ క్రమంలో మార్షల్స్ కు, కాంగ్రెస్ ఎంపీలకు మధ్య తొపులాట జరిగింది.

సభలో తీవ్ర గంధరగోళం ఏర్పడటంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబి అజాద్ నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకువెళ్లి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఎదురుగా నిలబడి గట్టిగా నినాదాలు చేశారు. మహారాష్ట్ర లో బీజేపి చేసింది ప్రజాస్వామ్య ఖూనీ అంటూ నినదించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో రాజ్యసభను మధ్యహ్నాం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

కాగా, అంతకుముందు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో శివసేన, ఎన్సీపి సభ్యులు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్దకు చేరకుని మహారాష్ట్రలో అధికార పార్టీ ప్రోద్భలంతో జరుగుతున్న రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా నినదించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ సోనియా గాంధీ నినదించారు. అమెతో మూడు పార్టీల నేతలు గళం కలిపారు. అంతకుముందు పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై 10 జనపథ్ లో సోనియాగాంధీ.. పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles