yeddyurappa interesting comments on defectors ‘‘వారిని గెలిపిస్తే మంత్రుల్ని చేస్తా’’: యడ్యూరప్ప

Will give ministries to defectors yeddyurappa interesting comments

BS Yeddurappa, Chief Minister, BJP contestants, Ministers, Siddaramaiah, Shiva Kumar, congress, BJP, JDS, Kumara swamy, karnataka, politics

Karnataka Cheif Minister Yeddyurappa interesting comments on the ongoing by polls, urges people to vote for them as he will give ministries to those who made him CM of karnataka, for the fourth time.

‘‘వారికి మంత్రిపదవులంటూ..’’ సీఎం యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు..

Posted: 11/25/2019 01:03 PM IST
Will give ministries to defectors yeddyurappa interesting comments

కర్ణాటకలోని ఉపఎన్నికల నేపథ్యంలో విస్తృత్తంగా ప్రచారం చేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే వారిని మంత్రులను చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. వారి మద్దతుతోనే తాను నాలుగో పర్యాయం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పిన ఆయన.. వారిని మీరు ఉప ఎన్నికలలో గెలిపిస్తే.. రుణం తీర్చుకునేందుకు మంత్రి పదవులను ఇస్తాననంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 17 మంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని... ఎట్టి పరిస్థితుల్లో వారికి అన్యాయం చేయనని అన్నారు.

ఈ మేరకు వారికి మాట ఇచ్చానని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే వారందరికీ బీజేపి టికెట్ కేటాయించామని చెప్పారు. ఉపఎన్నికలలో వీరు గెలవగానే వారిన మంత్రులను చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరోగమనంలో వెళ్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సిద్ధరామయ్య ఇప్పటికీ అనవసరపు విమర్శలు చేస్తున్నారని... ఉపఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం నేర్పుతారని చెప్పారు.

కాగా, తమకు రాజకీయ భవిష్యత్తును కలిగించి ఓ స్థాయికి తీసుకువచ్చిన పార్టీకి నమ్మకద్రోహం చేసి.. వెన్నుపోటు పోడిచిన నాయకులతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఇలాంటి వారికి ఈ ఎన్నికలలో బుద్దిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిరాయింపులకు, ప్రలోభ రాజకీయాలకు తెరలేపుతూ.. ప్రజాతీర్పును కంఠకంగా మారిన పార్టీలకు కనువిప్పు కల్పించాలని ఆయన ప్రజలను కోరారు. ఎంతటి బలమైన వటవృక్షమైనా.. హోరు గాలి లాంటి ప్రజాతీర్పుకు కుప్పలాల్సిందేనంటూ ఆయన ప్రజలకు ఆకర్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles