మహారాష్ట్రలో రాజకీయం వెడెక్కింది. అనూహ్య మలువులు తిరుగుతున్న మహా రాజకీయాల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. బీజేపి తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి వారిని ఎక్కడ లాక్కుంటుందోనని.. విపక్షానికి చెందిన పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో రాష్ట్రంలోని స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేసుకున్నారు. ఇదే సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. తీర్పును మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెలువరిస్తామని ప్రకటించింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ వెంటనే బలపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వైపులా వాదనలు విన్న క్రమంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ భవన్ మెజార్టీని నిర్ణయించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని... శాసనసభలోనే బలపరీక్ష జరగాలని తెలిపింది. ఫడ్నవీస్ ప్రభుత్వానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉందా? అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాల మేరకు సొలిసిటర్ జనరల్ కోర్టుకు పలు వివరాలు వివరించారు. గవర్నర్ నిర్ణయాన్ని తెలిపేముందు అసలేం జరిగిందో కోర్టుకు వివరిస్తానని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అన్ని పార్టీలను ఆహ్వానించారని, పార్టీలన్నీ విఫలమైన తర్వాతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారని సొలిసిటర్ జనరల్ వివరించారు. దీనిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం గవర్నర్ కు లేదని అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఫడ్నవిస్ కు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ఇచ్చిన ఒరిజినల్ లేఖను సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ సమర్పించారు. కాగా ఎన్సీపీ తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఎన్సీపీ నేతలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు కవరింగ్ లెటర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు. అది కేవలం 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమేనని తెలిపారు.
బలపరీక్షకు రెండు పక్షాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ అదెప్పుడనేదే ఇప్పుడు ప్రశ్న అని అభిషేక్ సింఘ్వి చెప్పారు. గవర్నర్ కు అజిత్ పవార్ సమర్పించిన లేఖలో 54 మంది ఎమ్మెల్యేల సంతకం ఉంది.. కానీ, వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారా? అని ప్రశ్నించారు. ఆ లేఖలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. రెండు పక్షాలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నప్పుడు అఫిడవిట్లు, సమాధానాలు ఎందుకని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more