sabarimala ayyappa temple remains closed day before mandal puja అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఆ రోజున శబరిమల మూసివేత..

Sabarimala ayyappa temple remains closed day before mandal puja due to solar eclipse

Mandala Puja, Ayyappa Temple, Sabarimala, Mandala Kalam, Vrishchikam, ‘Makara Vilakku, December 27, ‘Guruvayur Temple, solar eclipse, Kerala

Due to the Solar eclipse on december 26 the day before Mandal pooja at, Sabarimala Ayyappa Temple will be closed for nearly four hours. The devotees are allowed for darshan after samproshana and punyahavacham is done. Mandala Puja along with ‘Makara Vilakku’ are the two major events held at the Sabarimala Ayyappa Temple.

అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఆ రోజున శబరిమల మూసివేత..

Posted: 11/25/2019 11:39 AM IST
Sabarimala ayyappa temple remains closed day before mandal puja due to solar eclipse

పవిత్ర పుణ్యక్షేత్రం శబరిగిరీశుడు అయ్యప్ప స్వామి కొలువైవున్న శబరికొండకు వెళ్లే భక్తులకు ఓ కీలక సమాచారాన్ని అందించింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. ఆయ్యప్ప స్వామి మండలపూజ నిర్వహించే డిసెంబర్ మాసంలో ఆలయం తెరుచుకోనున్నా.. సూర్యగ్రహణం కారణంగా నాలుగున్నర గంటల పాట ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ బోర్డు  అధికారులు స్పష్టం చేశారు. సరిగ్గా మండల పూజ మండల కలామ్ నిర్వహించేందుకు ఒక రోజు ముందున ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు.

డిసెంబర్ 26న సంక్రమించనున్న సూర్యగ్రహణం కారణంగా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రకటించింది. ఆ రోజు ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్టు పేర్కొంది. 26న ఉదయం 8:06 గంటలకు ప్రారంభయ్యే సూర్యగ్రహణం ఉదయం 11:13 గంటలకు ముగుస్తుంది. ఆలయంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించి.. పున్యాహవచనం చేసిన తరువాత కానీ.. స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించరు.

శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు మాలికాపురం, పంబలో ఉన్న సాక్షి గణపతి సహా మిగిలిన ఆలయాలను కూడా 26న మూసివేయనున్నట్టు ట్రావెన్ కోర్ దేవాలయ ఈవో తెలిపారు. కాగా, వచ్చే నెల 27న నిర్వహించనున్న మండల పూజల సందర్భంగా ఈ నెల 17న ఆలయాన్ని తెరిచారు. రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించుకుంటున్నారు. ఇక మండల పూజకు కూడా కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజారై స్వామివారిని సందర్శించుకుంటారు. అయితే సరిగ్గా ఒక్క రోజు ముందే ఆలయాన్ని మూసివేయునుండటం వల్ల రద్దీ ఏర్పడే అవకాశాలు వున్నాయి. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles