Fadnavis sworn in as CM backed by NCP Ajit Pawar మహా రాజకీయం: సీఎంగా దేవేంద్ర ఫడ్నావిస్.. డిఫ్యూటీగా అజిత్ పవార్

Devendra fadnavis sworn in as maharashtra cm ajit pawar deputy cm

BJP, Shiv Sena, Maharashtra President's rule, governor, Bhagat Singh Koshyari, President's rule, Devendra Fadnavis, Ajit pawar, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, bjp, congress, sonia gandhi, sharad pawar, sonia gandhi sharad pawar meeting, shiv sena, maharashtra govt formation, Maharashtra, Politics

In a major upheaval in Maharashtra politics, Devendra Fadnavis took oath as the Maharashtra Chief Minister for a second term at Raj Bhavan in Mumbai on Saturday while Sharad Pawar’s nephew and the Nationalist Congress Party's Ajit Pawar was sworn in as deputy CM.

మహా రాజకీయం: సీఎంగా దేవేంద్ర ఫడ్నావిస్.. డిఫ్యూటీగా అజిత్ పవార్

Posted: 11/23/2019 12:08 PM IST
Devendra fadnavis sworn in as maharashtra cm ajit pawar deputy cm

మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని భావించగా.. రాత్రికి రాత్రి మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అల్లుడు, సీనియర్ నేత అజిత్ పవార్ శివసేనకు సుతిమెత్తగా వెన్నుపోటు పోడిచారు. తనకు లభించే ఉపముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగాలని భావించిన ఆయన బీజేపితో చేతులు కలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నావిస్ తో చేతులు కలపి మహారాష్ట్రలో సరికొత్త కూటమికి తెరలేపారు. అంతేకాదు ఆగమేఘాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఇందుకు కీలక పాత్ర పోషించిన ఎన్సీపి నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, కిచిడీ ప్రభుత్వాన్ని కాదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీతో చేతులు కలిపినట్టు చెప్పారు.

గత నెల రోజులుగా ఎన్నో ట్విస్టులు, ఎంతో ఉత్కంఠతకు తెర లేపిన మహారాష్ట్ర రాజకీయం ఎట్టకేలకు బీజేపి-ఎన్సీపీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. దీంతో ముఖ్యమంత్రి పీఠంపై మరికొన్ని గంటల వ్యవధిలో కూర్చోబోతున్న తరుణంలో ఎన్సీపి ఇచ్చిన షాక్.. శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే ఆశలను నిట్టనిలువునా ముంచేసింది. అంతేకాదు కాంగ్రెస్ నేతలను కూడా ఖంగుతినేలా చేసింది. బిహార్ లో మహాఘట్ బంధన్ కూటమిని కూల్చివేసి.. నితిష్ కుమార్ తో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపి.. అలాంటి చర్యలకే ఇక్కడా పాల్పడుతోందని అంచనా వేసిన రాజకీయ విశ్లేషకులు అంచనాలకు సైతం తలకిందలయ్యాయి.

రాత్రికి రాత్రే బీజేపి రంగంలోకి దిగి చక్రం తప్పి.. మహారాష్ట్రంలో బీజేపి-ఎన్సీపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ బీజేపి దానిని సాధ్యం చేసి చూపింది. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలసి బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో వారికి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన కాసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర భవిష్యత్తు కోసం వారు కష్టపడి పనిచేస్తారని నమ్ముతున్నట్టు పేర్కొంటూ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అయితే శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసి ఏర్పడే కూటమిపై విమర్శలు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ కూటమిపై ఎలా స్పందిస్తారో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles