‘Thought Modi ji Was Giving This Money’ ‘‘సొమ్మొకరిది సోకొకరిది’’ ‘‘మోడీ డబ్బులేస్తున్నారని..’’

Pm s promise of rs 15 lakh landed this man in trouble here s how

Hukum Singh, State Bank of India (SBI), Rauni village, Rurai village, identical account numbers, Bhind, Madhya Pradesh, PM Modi, Election Promise, crime

PM Modi’s promise of Rs 15 lakh to every Indian has landed a SBI account holder in trouble. He believed that PM Modi was keeping his election promise after he received large amount of money coming into his account every month.

‘‘సొమ్మొకరిది సోకొకరిది’’ ‘‘మోడీ డబ్బులేస్తున్నారని..’’

Posted: 11/23/2019 01:46 PM IST
Pm s promise of rs 15 lakh landed this man in trouble here s how

తన ఖాతాలోకి నెలనెలా డబ్బులు వచ్చిపడుతుంటే.. మొదట్లో కాసింత ఆశ్చర్యానికి గురైనా.. తరువాత తేరుకుని వాటిని ఎంచక్కా తీసుకుని తన అవసరాలను తీర్చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసి అటు బ్యాంకు అధికారులు.. విచారిస్తే.. ఔను తన ఖాతాలోని డబ్బులు వచ్చాయి. వాటిని ఎన్నికల హామీలో భాగంగా ప్రధాని మోడీ వేశాడనుకున్నాను. అందుకనే నా అవసరాలకు వాడుకున్నాను అంటూ సమాధానమిచ్చాడు.

ఈ విచిత్రాన్ని చూస్తున్న స్థానికులు మాత్రం సొమ్మెకడిది.. సోకోకడిది అన్న చిత్రాన్ని చూసినట్లు వుందని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే బ్యాంకు అధికారులు చేసిన తప్పుకు ఖాతాదారుడి పరువు పోయేలా కథనాలు ప్రచురించడం సహేతుకం కాదన్న వారూవున్నారు. దీంతో ఏమీ సేతురా.. అంటూ బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు వాళ్లకెందుకు ఇంత టెన్షన్.. అసలు డబ్బులు వేసిందెవరు.? ఆ ఖాతా ఆ వ్యక్తికి చెందినదేనా.? అన్న ప్రశ్నలు మీ మదిని తొలుస్తున్నాయి కదూ.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఒకే పేరుతో ఇద్దరు ఖాతాదారులు వుండటం.. వారిద్దరూ ఓకే బ్యాంకుకు చెందిన శాఖలో ఖాతాను తెరవడం.. అది కూడా రమారమి ఒకే సమయంలో తెరవడం.. అసలు కారణంగా తెలుస్తోంది. అదెలా అంటే.. రురై గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్, రోనీ గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్‌ ఇద్దరూ భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఒకే శాఖలో ఖాతా తెరిచారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో బ్యాంకు అధికారులు పొరపాటున ఇద్దరికీ ఒకటే ఖాతా నంబరు కేటాయించారు.

ఇక్కడే బ్యాంకు అధికారులు అసలు పోరబాటుకు తెరలేపారు. ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్ బ్యాంకులో దాచుకుంటున్న డబ్బులు మరో హుకుమ్ సింగ్ ఖాతాలో జమ అవుతున్నాయి. తన ఖాతాలోకి వస్తున్న డబ్బును చూసిన హుకుమ్ సింగ్.. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని సంబరపడ్డాడు. ఎప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకుని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అలా ఆరు నెలల కాలంలో మొత్తం 89 వేల రూపాయలు డ్రా చేసి తన అవసరాలకు వాడేసుకున్నాడు.

ఇటీవల డబ్బులు అవసరం రావడంతో తాను దాచుకున్న డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా, అందులో లక్ష పైచిలుకు డబ్బులకు బదులుగా కేవలం రూ.35 వేలు మాత్రమే ఉండటం గమనించి నిర్ఘాంతపోయాడు. వెంటనే విషయాన్ని బ్యాంకు అధికారులు దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికి గానీ చేసిన పొరపాటును బ్యాంకు అధికారులు గుర్తించలేదు. తీరా ఇలా జరగడానికి కారణమైన మరో హుకుమ్ సింగ్ ను పిలిచి.. ‘డబ్బులు డ్రా చేసింది నీవేనా.. ఆ డబ్బలు మీ అకౌంట్లోకి ఎలా వచ్చాయని అనుకున్నావు’ అని విచారించారు.

బ్యాంకు అధికారుల ప్రశ్నలన్నింటినీ విని అన్నింటికీ తలూపిన హుకుమ్ సింగ్.. తాను చెప్పిన సమాధానం విన్న తరువాత ఏం చేయాలో బ్యాంకు అధికారులకు పాలుపోలేదు. ఇది దొంగతనం కిందకు వస్తుంది.. మీది కాని డబ్బు మీ అకౌంట్లోకి వస్తే బ్యాంకు అధికారులకు తెలియజేయాలే తప్ప.. వాటిని వాడుకోకూడదని తెలియదా అన్న బ్యాంకు అధికారుల ప్రశలకు అమయాకంగా అతనేం చెప్పాడంటే..  తనకేమీ తెలియదని.. నల్లధనాన్ని ప్రజల ఖాతాల్లో వేస్తానని మోదీ.. ఇచ్చిన హామీ ప్రకారం వేస్తున్నాడని అనుకున్నా.. ఇన్నాళ్లు లేని విధంగా ఇప్పుడే తన ఖాతాలోకి డబ్బులు అందుకే వస్తున్నాయని అనుకున్నాని చెప్పాడంతో అధికారులు తెల్లబోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hukum Singh  SBI  Rauni village  Rurai village  PM Modi  Election Promise  Bhind  Madhya Pradesh  crime  

Other Articles