All alliance negotiations done: Congress కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం.. రేపే కీలక నిర్ణయం..

All negotiations done final decision on friday says congress

BJP, Shiv Sena, Maharashtra President's rule, governor, Bhagat Singh Koshyari, President's rule, Devendra Fadnavis, Aravind sawant, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, bjp, congress, sonia gandhi, sharad pawar, sonia gandhi sharad pawar meeting, shiv sena, maharashtra govt formation, Maharashtra, Politics

Prithviraj Chavan said all the negotiations on the alliance with the Shiv Sena for the government formation in Maharastra have been completed. The final decision, he said, would be taken on Friday.

కూటమితో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం.. రేపే కీలక నిర్ణయం..

Posted: 11/21/2019 04:31 PM IST
All negotiations done final decision on friday says congress

మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి సర్కార్‌పై స్పష్టత వస్తోంది. అధికార పంపకంపై విస్తృతంగా చర్చిస్తున్న ఆయా పార్టీల ప్రతినిధులు వీలైనంత త్వరగా ఈ కసరత్తును పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శివసేన-ఎన్సీపీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకునేలా, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎం ఆఫర్‌ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. మరోవైపు రైతు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించడం, కనీస ఉమ్మడి కార్యక్రమం ఖరారు,

లౌకిక స్ఫూర్తికి కట్టుబడటం వంటి కీలక అంశాలపై మూడు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే పాలనా పగ్గాలు చేపడతారని, డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌ థొరట్‌లు బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఇక ఎన్సీపీ నూతన క్యాబినెట్‌లో మంత్రులపై కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత వేణఉగోపాల్ మాట్లాడుతూ మహారాష్ట్రలో ఓ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని, ఈ దిశగా శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. శివసేన - ఎన్సీపీల మధ్య ఓ డీల్ కుదిరితే, ఆపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని, ముందు ఆ రెండు పార్టీలూ ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.

అయితే, శివసేన - ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు సిద్ధమని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో ఈ సాయంత్రం నుంచి మూడు పార్టీల మధ్యా తుది చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఇక బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా నిధులను మహారాష్ట్రలో సమస్యల బారిన పడిన రైతాంగానికి వెచ్చించాలనే అంశంపైనా సేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు యోచిస్తున్నట్టు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shiv sena  uddhav thackeray  bjp  congress  sonia gandhi  sharad pawar  Maharashtra  Politics  

Other Articles