APSRTC Employees no to get pension even after merging ఆర్టీసీ విలీనం చేస్తాం.. కానీ అంటూ మెలిక పెట్టిన ప్రభుత్వం..

Apsrtc employees no to get pension even after merging

TSRTC Workers, High Court, TSRTC strike, Telangana bus strike, IAS officials, APSRTC, YSRCP, AP Government, Employees, Recognition, Pension, YS Jagan Mohan Reddy, Anjaneyulu Committee, Andhra Pradesh, Politics

Union leaders of the Andhra Pradesh State Road Transport Corporation are in dilema on whether to agree or not to merge APSRTC into State Transport corporation, as the Government announces they will not be able to provide Pension to Employees.

ఆర్టీసీ విలీనం చేస్తాం.. కానీ అంటూ మెలిక పెట్టిన ప్రభుత్వం..

Posted: 11/21/2019 05:29 PM IST
Apsrtc employees no to get pension even after merging

టీఎస్ఆర్టీసీ కార్మికులు 49 రోజులగా చేస్తున్న సమ్మెను విరమించడానికి సిద్దంగా వున్నారని కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ వేదిక ప్రకటించినా.. వారిని విధుల్లోకి తీసుకోవాలా.. వద్దా అనే విషయంలో 24 గంటలుగా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం ఏ విషయాన్ని స్పష్టం చేయలేదు. ఇదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి తాము సిద్దమని.. అయితే పదవీ విరమణ తరువాత పెన్షన్ మాత్రం ఇవ్వబోమని పొరుగు రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా మెలిక పెట్టింది. దీంతో గత 49 రోజులుగా సాగుతున్న సమ్మె ఇక్కడ ముగుస్తుండగా, అక్కడ కార్మికుల అందోళనకు కారణం అవుతుందా.? అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టు బట్టిన కార్మికులు ఈ ప్రకటన వెలువడగానే సంబరాలు చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం చేసిన ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. అధికారులుకు జీతాలు బాగా తగ్గడంతో పాటు మొత్తం సిబ్బందికి పెన్షన్ ఉండదని చెబుతుండడమే ప్రధాన కారణాలు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆర్టీసీకి 52,000 మంది సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి కమిటీ సెప్టెంబర్ లో ఇచ్చిన నివేదికలో ఆర్టీసీని విలీనం చేయటం సాధ్యం కాదని చెప్పింది.

దీంతో ఆర్టీసీలో ఉన్నత పదవుల్లో వున్నవారిని మినహాయించి.. సిబ్బంది వరకు విలీనం చేయాలని సీఎం జగన్ ఇచ్చిన సూచనలు కమిటీ అమలు చేసింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఈ మేరకు కమిటీ ఏర్పాటైంది. డిసెంబర్ లోపే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ప్రజా రవాణా శాఖలోకి 52,000 ల మంది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. విధి విధానాలు రూపొందించి సిబ్బందిని విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. విధి విధానాల రూపకల్పనలో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జీతాలు చాలా తగ్గించాలని కమిటీలోని కొందరు సభ్యులు సూచించినట్టు తెలిసింది.

ప్రిన్సిపల్ సెక్రెటరీ కన్నా ఆర్టీసీ ఈడీలకు ఎక్కువ జీతాలున్నాయని.. జిల్లా కలెక్టర్ల కన్నా రీజియన్ మేనేజర్ లకు వేతనాలు అధికమని తేలింది. వచ్చే జనవరి నుంచి ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రభుత్వంలో విలీనం అవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ ఈడీ, ఆర్ఎం, డీఎం లకు హోదాలకు అనుగుణంగా జీతాలు నిర్ణయించాలని కమిటీ సూచించినట్టు ఆర్టీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలవెన్సులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించాలనే చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే పెన్షన్ ఆర్టీసీ నుంచి విలీనమయ్యేవాళ్లకు వర్తించదని జీపీఎఫ్ ఇస్తే ఆర్థిక భారం ప్రభుత్వం పై ఎక్కువగా పడుతోందని అవసరమైతే సీపీఎఫ్ కి అవకాశమిద్దాం తప్ప జీపీఎఫ్ వద్దే వద్దని కమిటీ సభ్యుల పేర్కొన్నట్లు తెలుస్తోంది. పెన్షన్ ఉండబోదన్న వార్తలు కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. అదే లేకపోతే తమకు విలీనం వల్ల కలిగే లాభం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడి జీవిత చరమాంకంలో కనీస పెన్షన్ భద్రత లేకుంటే ఎలా అంటున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది ఇప్పటికే ప్రభుత్వంలో విలీనమయ్యారు. రవాణా సంస్థలను అక్కడి ప్రభుత్వాలే నిర్వహిస్తూ ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అహ్మదాబాద్, ముంబై, పూనె,తానే, షోలాపూర్ తదితర చోట్ల స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ లు నిర్వహిస్తున్నందున అక్కడ పెన్షన్ చెల్లించడం లేదు. దీన్నే కమిటీ అధికారులు ప్రస్తావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APSRTC  AP Government  Employees  Recognition  Pension  YS Jagan  Anjaneyulu Committee  Andhra Pradesh  

Other Articles