Nitin Gadkari to solve TSRTC strike ఆర్టీసీ సమస్యను పరిష్కారించాలని కేంద్రానికి ఎంపీల వినతి

Kishan reddy urges nitin gadkari to solve tsrtc strike

TSRTC Workers, Nitin Gadkari, Kishan reddy, Dharmapuri Aravind, Bandi Sanjay, Soyam Baburao, High Court, RTC MD Sunil sharma, kareem khan, karimnagar, TRS, rtc mechanic, heart stroke, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Union MInistry for Road and Buildings Minister Nitin Gadkari to hold talks with CM KCR and Officials on the oning strike, after a request in this regard is bought to notice of the minister by Telangana MPs.

ఆర్టీసీ సమస్యను పరిష్కారించాలని కేంద్రానికి ఎంపీల వినతి

Posted: 11/21/2019 03:42 PM IST
Kishan reddy urges nitin gadkari to solve tsrtc strike

తెలంగాణ ఆర్టీసీలోని కార్మికులు సమ్మె బాట పట్టి ఏకంగా 49రోజులు కావస్తున్న తరుణంలో.. ఇటు రాష్ట్రంలో మరో ప్రజా రవాణ వ్యవస్థ లేక.. ప్రజలు కూడా అనేక అవస్తలు పడుతున్నారని గ్రహించిన కేంద్రం సమ్మెపై  స్పందించింది. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఇదివరకే కార్మికులు తాము సమ్మె విరమించేందుకు సిద్దమని సంసిద్దతను వ్యక్తం చేసిన తరుణంలో.. సమస్య రమారమి పరిష్కారం అయ్యిందని.. ఈ క్రమంలో దీనిని మరలా మరింత జఠిలం చేయవద్దని సీఎం కేసీఆర్ కు సూచిస్తామని అన్నారు. ఇక్కడ సమస్య కార్మికులతో మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలతో పాటు ప్రజారవాణా వ్యవస్థతో కూడా ముడిపడివుందన్ని విషయాన్ని సూచిస్తామన్నారు, పరఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు గురువారం గడ్కరీని కలిశారు.

అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీని కోరినట్టు వెల్లడించారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని విడిచిపెట్టాలని సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుని, వారి కనీస డిమాండ్లను నెరవేర్చాలని కిషన్‌రెడ్డి కోరారు. తమ వినతిపై గడ్కరీ సాను​కూలంగా స్పందించారని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీయిచ్చినట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Workers  Nitin Gadkari  Kishan reddy  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles