TSRTC strike to continue, say JAC leaders ‘‘ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతోందా.?’’

Tsrtc strike enters 46th day final decision after hc judgment

TSRTC Workers, High Court, sadak bandh, BJP Laxman, TRS Agents, IAS officials, RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

TSRTC Unions Joint Action Committee to take final decision on the 46 day long Strike, after the judgment of Telangana High Court, Whether to continue or to call off.

ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతోందా.? సమ్మెపై హైకోర్టు ప్రశ్న

Posted: 11/19/2019 07:12 PM IST
Tsrtc strike enters 46th day final decision after hc judgment

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 46వ రోజుకు చేరింది. సమ్మెపై రెండు వారాల్లో తేల్చాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు లేబర్ కోర్టును అదేశించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవ్యతిరేకం అని చెప్పలేమని ఇదివరకే స్పష్టం చేసిన న్యాయస్థానం.. అటు ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేయవద్దని ఎలా కోరుతారని ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణ సందర్భంగా మోటార్ వాహనాల చట్టం కింద ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటుందని పేర్కోంది. ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయం తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వం చట్ట పరమైన ప్రక్రియ అనుసరిస్తుందా లేదా అనేది తెలియకుండా ఇప్పుడే చట్ట విరుద్ధమని ఎలా ప్రకటిస్తామని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం.. ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో వివరించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతోందా? అని రాష్ట్రోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రపంచం గ్లోబలైజేషన్‌, క్యాపిటలైజేషన్‌ కాలంలో ఉందని పేర్కొంది. కాగా కేసు తదుపరి విచారణను రేపటి (బుధవారానికి) వాయిదా వేసింది.

కాగా, ఆర్టీసీ సమ్మె కొనసాగింపా.? లేక బేషరుతుగా విరమించడమా.? అన్నది కార్మిక సంఘాలు తేల్చుకోలేకపోతున్నాయి. ఇవాళ జరగాల్సిన సడక్ బంద్ అందోళనను అకస్మాత్తుగా నిలిపివేసిన జేఏసీ.. 46 రోజులుగా తాము చేస్తున్న సమ్మెను విరమించాలా.? వద్దా.? అన్న సందిగ్ధంలో పడింది. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న కార్మికసంఘాలు తాజాగా రేపు హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపాయి. సమ్మె నేపథ్యంలో తమ డిమాండ్లపై ప్రభుత్వం మెట్టుదిగకపోవడం.. కార్మికులు మానసిక అందోళనకు గురికావడం.. బలవన్మరణాలకు గురికావడం కూడా కార్మిక సంఘాల నేతలను పునరాలోచనలో పడేసింది.

సమ్మె, భవిష్యత్‌ కార్యాచరణపై ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాయని.. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయాన్ని జేఏసీకి అప్పగిస్తూ తీర్మానించాయని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి చెప్పారు. జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాలన్నీ హామీ ఇచ్చాయని అశ్వత్థామరెడ్డి వివరించారు. రేపు హైకోర్టులో విచారణ అనంతరం తీర్పు ప్రతి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని.. అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  sadak bandh  TRS Agents  IAS officials  BJP Laxman  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles